మోగిన తుడుం దెబ్బ. అదనపు బలగాల మోహరింపు.

ఆదిలాబాద్:
మా ఊళ్ళో… మా రాజ్యం… అంటూ ఆదివాసీలు మరోసారి తుడుం దెబ్బ మోగించారు.. నిరసనల తో ఆదివాసీ గుడాలు మారు మొగుతున్నాయి…మవనాటే.. మావ రాజ్… మావ నాటే.. మావ సర్కార్ అంటూ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.. స్వ పరిపాలనకు నిదర్శనం గా గోండ్వాన జెండాను ఎగురవేశారు.. లాంబాడీలను ఊళ్ళోకి రానిచ్చేది లేదంటూ పట్టుబడుతుండడం తో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా లోని ఏజెన్సీ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్,నిర్మల్, కొమురం భీం జిల్లాలోని ఏజెన్సీలో ఆదివాసీల ఉద్యమం రోజుకు ఓ రూపంలో మారుతుంది…మొదటి రోజు కొమరం భీం జిల్లాలోని జైనూర్ మండలం మర్లవాయి గ్రామంలో ఆదివాసీలు తుడుం దెబ్బ మోగించారు.. ఆదివాసీల ను ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని స్వయం పరిపాలన కు తుడుం దెబ్బ మోగించారు..మా ఊళ్ళో మా రాజ్యం అంటూ ఆదివాసీలు నినదించారు. లాంబాడీలను ఊళ్ళోకి రానివ్వకూడదని తీర్మాణం చేసుకున్నారు. మా ఊళ్ళో మా రాజ్యం అంటూ ఎక్కడికక్కడ బోర్డులు పాతారు.. లాంబాడీలను ఊళ్ళోకి రానివ్వద్దని తీర్మానం చేసిన కాపీలను స్కూళ్లలో, కార్యాలయాల్లో గూడా లలో పంచి పెట్టారు.. ఏజెన్సీలోని కార్యాలయాల పై అక్కడక్కడా నల్ల జెండాలు ఎగుర వేసి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పోలీస్ లు అడ్డుకున్నారు. లాంబడి ఉద్యోగుల ను అడ్డుకున్నారు. లాంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలనే డిమాండ్ తో ఆదివాసీల, లాంబాడీల మధ్య అప్పట్లో పెద్ద యుద్ధమే నడిచింది. ఘర్షణలు చెలరేగాయి. ప్రభుత్వం జోక్యం చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఎస్టీ జాబితా నుండి లాంబాడీలను తొలగించే విషయంలో తమకు ప్రభుత్వం నుండి స్పష్టత రాలేదని ఆదివాసీలు తుడుం దెబ్బ మోగించారు.. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ పై నల్ల జెండా ఎగుర వేసేందుకు ప్రయత్నం చేయగా పోలీస్ లు అడ్డుకున్నారు. దస్నాపూర్ లో లాంబాడీల వంద ఎకరాల భూమిలో జెండాలు పాతెందుకు ఆదివాసీలు ప్రయత్నించడం ఉద్రిక్తత పరిస్థితులకు దారితీశాయి. పోలీస్ ల జోక్యం చేసుకొని అడ్డుకున్నారు. వారికి నచ్చ చెప్పి వెనక్కి పంపేందుకు పడరాని పాట్లు పడ్డారు.. ఆదివాసీల ఉద్యమం రోజు రోజుకు ఉదృతం అవుతుండడం తో పోలీస్ లలో టెన్షన్ మొదలైంది. ఎప్పుడు ఏమి జరుగుతుందో అని అలర్ట్ గా ఉంటున్నారు. అదనపు బలగాలను మోహరించి డేగ కళ్ళ తో కాపలా కాస్తున్నారు..