మోడీ-కెసిఆర్ ల మధ్య ‘కొత్తవంతెన.’

గవర్నర్ తో సి.ఎం.భేటీ కావడం అనేది కొన్ని సంవత్సరాల క్రితం పెద్ద సంచలనం. గొప్పవార్త.ఆ భేటీకి అంతగా ప్రాధాన్యం,ప్రాముఖ్యతఉండేది. కెసిఆర్, నరసింహన్ కలుసుకునే, పుష్పగుచ్చాలు ఇచ్చి పుచ్చుకునే సన్నివేశాలు తరచుగా జరుగుతున్నందునఈభేటీలకు రాజకీయ ప్రాధాన్యం లేకుండా పోయింది. ముఖ్యమంత్రి కెసిఆర్ దూరదృష్టి కలనాయకుడు.ఏ వ్యక్తి నుంచి ఎలాంటి ‘ఇన్ పుట్స్’ లభిస్తాయో, ఎవరినుంచి ఎలాంటి ‘ప్రయోజనాలు’ లభించగలవోఆయన సులభంగా ‘స్కానింగ్’ చేయగలరు. అందుకే అయన డిల్లీ వెళ్ళే ముందు,లేదా డిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకోగానే గవర్నర్ తో సమావేశమవుతుంటారు. ఈ సమావేశాల్లో జరిగే చర్చలను అంచనా వేయడం కష్టం కాదు. డిల్లీ‘నాడి’ ఎలాఉంది?ప్రధాని అంతరంగం ఏమిటి?కేంద్ర ప్రభుత్వం తెలంగాణ గురించిఏమనుకుంటున్నది? వంటి విషయాలు గవర్నర్ నుంచి కెసిఆర్ తెలుసుకునే అవకాశం ఉండవచ్చు. అలాగే మోడీ తో జరిగిన భేటీలో ప్రస్తావనకు వచ్చిన అంశాలు, జరిగినచర్చలు ,ప్రధాని ‘మూడ్’ తదితర విషయాలను కెసిఆర్, గవర్నర్ తో పంచుకునే అవకాశాలు లేకపోలేదు. రాష్ట్ర విభజనకు ముందు నుంచే నరసింహన్ గవర్నర్ గా కొనసాగుతున్నారు.బీజేపి అధికారంలోకి వచ్చిన తరువాత చాలా రాష్ట్రాలలో గవర్నర్ లను తొలగించి తమకుఅనుకూలమైన వారిని,బిజెపి నాయకులను నియమించుకున్నా నరసింహన్ ని మాత్రం బీజేపీకొనసాగిస్తోంది.అందుకుకారనం‘నరసింహన్’నమ్మకస్తుడుకావడమే!

హైదరాబాద్;
గవర్నర్విధులుఏమిటి?ఆయనఏమిపనిచేయాలి? ఇటీవలి కాలంలో గవర్నర్ నరసింహన్ వ్యవహార శైలి వివాదాస్పదమవుతున్నది. ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని,ముఖ్యమంత్రి కెసిఆర్ ను కేంద్రప్రభుత్వం దగ్గర ‘మార్కెటింగ్’ చేస్తున్నారనే ఆరోపణలకు బలం చేకూర్చే వార్తా కథనాలు తరచూ వెలువడుతున్నవి. తెలంగాణలో రైతాంగానికి మేలు చేయడానికి కెసిఆర్  విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారని నరసింహన్‌ ఇటీవల ప్రధానమంత్రి మోడీకి తెలిపారు. రాష్ట్రంలో రైతులందరికీ పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వడమే కాకుండా ఎకరానికి రూ.4 వేల చొప్పున పెట్టుబడి సాయం ఇస్తున్నారని ఆయన  తెలిపారు. తెలంగాణలో 57 లక్షల మంది రైతులకు ఆగస్టు 15 నుంచి రైతు బీమాను అమలు చేయనున్నారని, ఎల్‌ఐసీ ద్వారా ఈ పథకాన్ని రైతులందరికీ వర్తింపజేయనున్నట్లు ప్రధానికి  వివరించారు. బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించి, రైతులు చనిపోతే రూ.5 లక్షలను 10 రోజుల్లో చెల్లించేలా చర్యలు తీసుకోనున్నారని ప్రధాని మోడీకి గవర్నర్ నరసింహన్ తెలిపారు. దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా భూరికార్డులనుప్రక్షాళన  చేశారని ప్రధానికిచెప్పారు. ఏపీలో కూడా నిరుద్యోగులకు నెలకు రూ.1000 భృతి ఇవ్వడానికి సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని, రెండు రాష్ట్రాల్లోనూ సంక్షేమ పథకాల అమలుకు చర్యలు తీసుకుంటున్నారనిగవర్నర్వివరించారు. రాష్ట్రపతి ఆధ్వర్యంలో డిల్లీలో  నిర్వహించిన గవర్నర్ల సదస్సులోనూ  నరసింహన్‌ తెలుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పథకాలను వివరించారు. జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా రాజకీయ కూటములు ఏర్పాటు చేసే ప్రయత్నాలు తెలుగు రాష్ట్రాల్లో ఊపందుకుంటున్నట్టు ప్రధాని మోడీకి  గవర్నర్‌ ఈ.ఎస్.ఎల్. నరసింహన్‌ తెలియజేసినట్టు వార్తలు వచ్చాయి. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో తెలుగు సీఎంలే కీలక పాత్ర పోషించారని గవర్నర్ అన్నారు. కాంగ్రెసుతో  జేడీఎస్‌ పొత్తు కుదుర్చుకోవడానికి కేసీఆర్‌, చంద్రబాబే ప్రధాన కారణమని ఆయన  గుర్తుచేశారు. నేషనల్‌ ఫ్రంట్‌ సమయంలోదేవెగౌడతో ఉన్న పరిచయాలతో చంద్రబాబు చక్రం తిప్పారన్నారు. రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,చంద్రబాబు,కెసిఆర్తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలను ప్రధానికి  వివరించారు. ఏపీ సీఎం చంద్రబాబు దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీయేతర పార్టీలను ఏకం చేస్తున్నారని, తెలంగాణ సీఎం కేసీఆర్‌ దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నింటినీ కలిపి ప్రత్యామ్నాయ వేదికను నిర్మించడానికి ప్రయత్నిస్తున్నట్టు మోడీకి గవర్నర్ తెలిపారు. 2019 ఎన్నికల్లో బలమైన శక్తిగా అవతరించేందుకు కేసీఆర్‌ ప్రయత్నాలు చేస్తున్నారని వివరించారు. ప్రత్యామ్నాయ రాజకీయాలకు తెలుగు రాష్ట్రాలు కీలకం కానున్నాయని కూడా గవర్నర్ నరసింహన్ ప్రధానికి చెప్పినట్టు వార్తలు వచ్చాయి.

ముఖ్యమంత్రికెసిఆర్,గవర్నర్ నరసింహన్ బంధం నానాటికీ బలపడుతూ వస్తున్నది.గవర్నర్ తో సి.ఎం.భేటీ కావడం అనే ఘట్టం కొన్ని సంవత్సరాల క్రితం పెద్ద సంచలనం.గొప్పవార్త. ఆ భేటీకి అంతగా ప్రాధాన్యం,ప్రాముఖ్యతఉండేది. కానీ రోజులు మారాయి. కెసిఆర్, నరసింహన్ కలుసుకునే, పుష్పగుచ్చాలు ఇచ్చి పుచ్చుకునే సన్నివేశాలు తరచుగా జరుగుతున్నందున ఈభేటీలకు రాజకీయ  ప్రాధాన్యం లేకుండా పోయింది.ముఖ్యమంత్రి కెసిఆర్ దూరదృష్టి కలనాయకుడు. ఏ వ్యక్తి నుంచి ఎలాంటి ‘ఇన్ పుట్స్’ లభిస్తాయో, ఎవరినుంచి ఎలాంటి ‘ప్రయోజనాలు’ లభించగలవోఆయన సులభంగా ‘స్కానింగ్’ చేయగలరు.అందుకే అయన డిల్లీ వెళ్ళే ముందు,లేదా డిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకోగానే గవర్నర్ తో సమావేశమవుతుంటారు.ఈ సమావేశాల్లో జరిగే చర్చలను అంచనా వేయడం కష్టం కాదు. డిల్లీ‘నాడి’ ఎలాఉంది? ప్రధాని అంతరంగం ఏమిటి? కేంద్ర ప్రభుత్వం తెలంగాణ గురించి ఏమనుకుంటున్నది? జాతీయ రాజకీయాల  ‘ఉష్ణోగ్రత’ ఎలా ఉంది? వంటి విషయాలు గవర్నర్ నుంచి కెసిఆర్ తెలుసుకునే అవకాశం ఉండవచ్చు. అలాగే మోడీ తో జరిగిన భేటీలో ప్రస్తావనకు వచ్చిన అంశాలు, జరిగినచర్చలు ,ప్రధాని ‘మూడ్’ తదితర విషయాలను కెసిఆర్, గవర్నర్ తో పంచుకునే అవకాశాలు లేకపోలేదు. రాష్ట్ర విభజనకు ముందు నుంచే నరసింహన్ గవర్నర్ గా కొనసాగుతున్నారు. బీజేపి అధికారంలోకి వచ్చిన తరువాత చాలా రాష్ట్రాలలో గవర్నర్ లను  తొలగించి తమకుఅనుకూలమైన  వారిని, బిజెపి నాయకులను  నియమించుకున్నా  నరసింహన్ ని మాత్రం బీజేపీ కొనసాగిస్తోంది. గవర్నర్ కు  రెండు రాష్ట్రాల నాయకులతో మంచి పరిచయాలు, సంబంధాలు  ఉండటం, వారిని  అవసరమైతే ఎలా అదుపు  చేయాలో తెలిసినందునబీజేపి ఆయననుకొనసాగిస్తున్నట్టుగా భావిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా గవర్నర్ పై  అటు ఏపీ లో బీజేపి నేతలు , ఇటుతెలంగాణలో కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు.గవర్నర్ కెసిఆర్ పక్షపాతిగా వ్యవహరిస్తున్నట్టు కాంగ్రెస్ తెలంగాణ నాయకులుపలుమార్లు ఆరోపించారు. ఇసుక మాఫియా విషయమై ఫిర్యాదు చేయడానికి  తెలంగాణ కాంగ్రెస్ నాయకులువెళ్ళినపుడు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ కు గవర్నర్ నరసింహన్ ‘మద్దతు’ ఇవ్వడం  కాంగ్రెస్ నాయకులకు  ఆగ్రహం కలిగించింది. గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌కు, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఎంపీ మల్లురవి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది. ఇసుక మాఫియాకు బలైనవీఆర్‌ఏ సాయిలు ప్రస్తావన తీసుకురాగ ఆయన సాధారణ వ్యక్తి అంటూ గవర్నర్‌ తేలికగాకొట్టిపారవేయడానికి ప్రయత్నించడం వివాదానికి దారి తీసింది. “నేరెళ్ళఘటనలోకేటిఆర్ పాత్ర ఏముంద’ని గవర్నర్‌ ప్రశ్నించడంతోటికాంగ్రెస్ నాయకులు మరింత ఖంగుతిన్నారు.‘ఇసుక వ్యాపారం కొత్తేమీ కాదని, గతంలోనూ జరిగినట్లే ఇప్పుడూ జరుగుతున్నద’ని ముఖ్యమంత్రిని, ఆయనకుమారుడ్ని గవర్నర్‌  వెనుకేసుకొని వచ్చారని కాంగ్రెస్ నాయకులు గవర్నర్ పై  మండిపడ్డారు. తననుటీఆర్ఎస్ ఏజెంట్ అని కాంగ్రెస్ నాయకులు నిందించడం పట్ల గవర్నర్ నరసింహావతారం ఎత్తారు.‘ప్రతిదానికీ సీఎం కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆరేనా? వారిద్దరిపై ఆరోపణలు తగదు. ఇంతకుముందు మాదిరే ఇప్పుడూ ఇసుక మాఫియా ఉంది’ అని నరసింహన్ అన్నారు.గత జనవరిలో ఈ ఘటన జరిగింది. గవర్నర్ విచక్షణాధికారాల గురించి చాలా కాలంగా  చర్చ జరుగుతూనే ఉన్నది. తమిళనాడులో జయలలిత మరణం తర్వాత కొత్త ముఖ్యమంత్రిని నియమించేటప్పుడు ఎవరిని నియమించాలో గవర్నర్ నిర్ణయించాలి. జల్లికట్టు ఉద్యమ సమయంలో కేంద్రానికి, రాష్ర్టానికి మధ్య అనుసంధానకర్తగా గవర్నర్ వ్యవహరించాడు. శశికళ, పన్నీర్సెల్వానికి మధ్య జరిగిన అధికార కుమ్ములాటలో, చివరికి పళనిస్వామి ముఖ్యమంత్రి పీఠం ఎక్కినంతవరకు గవర్నర్ పోషించిన పాత్రపై ఎన్నో విమర్శలూ, ఎన్నో వివాదాలూ వచ్చాయి. పళనిస్వామి ఎంపిక రాజ్యాంగబద్ధంగా లేదని ప్రధానప్రతిపక్షం డీఎంకే గవర్నర్‌కి ఫిర్యాదు చేయడం, ఆ ఎంపికపై గవర్నర్ కేంద్రానికి ఒక నివేదిక పంపడం  ఉత్కంఠను  రేకెత్తించాయి. అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనపై సుప్రీంకోర్టు అక్షింతలు వేయడం, గవర్నర్ అధికారాలపై తీవ్ర చర్చ జరిగింది. ఎన్‌డీఏ ప్రభుత్వం రాగానే ఉన్న గవర్నర్లను రాజీనామా చేయమనడం, వారి ఎంపిక, తొలగింపు పై తీవ్రమైన చర్చ కూడా నడుస్తున్నది. గవర్నర్‌ను కేంద్ర ప్రభుత్వ ఆదేశాల అనుసారం నియమించినా, రాజ్యాంగ పరంగా గవర్నర్ ఒక స్వతంత్ర సంస్థ.ఇదితనకుతానుగా స్వతంత్రంగా వ్యవహరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఒక సబార్డినేట్ ఆఫీస్‌గా ఉండకుండా జాగ్రత్త పడుతూ ఉంటుంది.