మోడీ పాలేరు పాలించాలా! రాహుల్ మనిషి పాలించాలా!! – రేవంత్ రెడ్డి:

హైదరాబాద్:

మోడీ పాలేరు కేసీఆర్ తెలంగాణను పాలించాలా? లేక రాహుల్ గాంధీ మనిషి పాలించాలా! ప్రజలు తీర్పు ఇవ్వాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో ఆయన ప్రచారం నిర్వహించారు. ముందస్తు ఎన్నికల కోసం కేసీఆర్ మోడీ కాళ్ళ వద్ద మొకరిల్లాడని అన్నారు.ఎన్నికల్లో ఏ హామీ నెరవేర్చని కేసీఆర్ కు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు.

తెలంగాణ ఇచ్చిన సోనియా ను అమ్మానా .. బొమ్మానా అంటున్న కేసీఆర్… ఓ కమీనా..అని నిందించారు.మళ్ళీ అధికారం దక్కదన్న భయం కేసీఆర్ ను వెంటాడుతోందన్నారు.కేసీఆర్ తాగి రాష్ట్రాన్ని నడుపుతున్నారని ఆరోపించారు.

మందుతాగి రాష్ట్రాన్ని నడుపుతున్న కేసీఆర్ ను అండమాన్ జైల్లో పెట్టాల్సిన బాధ్యత పోలీస్ లకు లేదా? అని ప్రశ్నించారు.తెలంగాణ సెంటిమెంట్ రగిల్చేందుకు కేసీఆర్ చంద్రబాబు నాయుడిని తెరమీదకు తెస్తున్నాడని అన్నారు.రాష్ట్రానికి కేసీఆర్ పీడ విరగడ కావడానికి చంద్రవాబు కాంగ్రెస్ కు మద్దతిస్తున్నారని తెలిపారు.
కేసీఆర్ ను గద్దె దింపేందుకు ప్రతి ఇంట్లో ఒక్కరు యుద్దానికి సిద్ధమై బయటికి రావాలని కోరారు.
రాష్ట్రాన్ని పాలిచేది పాస్ పోర్ట్ బ్రోకర్ ఉండాలనా కాంగ్రెస్ నాయకుడు ఉండాలా?అని రేవంత్ అన్నారు.ఈ ఎన్నికల్లో తెరాసకు కరెంటు షాక్ తప్పదన్నారు.ముస్లింలకు సముచిత ప్రాధాన్యం ఇస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు.

మోడీ కాలర్ పట్టుకొని జోనల్ వ్యవస్థ తీసుకోస్త అని చెప్పిన కేసీఆర్ ముస్లింలకు 12 శాతం రిజార్వేషన్ ఎందుకు సాధించలేదన్నారు.
ఇఫ్తార్ విందు పేరుతో ముస్లింల ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం జరిగిందన్నారు.60 రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.కేసీఆర్ సీఎం అయ్యాక అయన కుటుంబం తప్ప ఎవరూ బాగుపడుతుంది.కనీసం అమరుల కుటుంబాలను పట్టించుకోలేదన్నారు.కేటీఆర్ ఏం పోడుస్తవ్ చూద్దామని చెప్పారు.”ఐదేళ్లు పాలించమని అధికారం ఇస్తే ముందస్తు ఎందుకు సమాధానం చెప్పాలి.కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుంది. అందుకే నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు.ఎన్నికల షెడ్యూల్ వచ్చింది.
ఇపుడు పోలీసులు స్వేచ్ఛగా పని చేయొచ్చు.

తాగి బండి నడిపే వారిని అరెస్ట్ చేస్తున్న పోలీసులు,తాగి ప్రభుత్వం నడుపుతున్న కేసీఆర్ ను ఏమీ చేయలేరా?ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ అడ్డు పెట్టుకొని మళ్ళీ కేసీఆర్ అధికారం కోసం ఎత్తులు.ఇవాళ కాంగ్రెస్ ను విజయం కోసం తెదేపా మద్దతు ఇస్తుంది. 60 రోజులు మాట ఇవ్వండి.60 నెలలు మీకోసం కాంగ్రెస్ పని చేస్తుంది.ఎక్కడికి పోయిన రాబోయే ఎన్నికల గురించి మాట్లాడండి. రాహుల్ నాయకత్వం దేశానికి అవసరం ఉంది.మోడీ జీతగాడు కేసీఆర్.తెలంగాణ ప్రజలకు మంచి జరగాలంటే కాంగ్రెస్ సాధ్యం.ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి అండగా వుండాలి” అని రేవంత్ విజ్ఞప్తి చేశారు.