మహబూబ్ నగర్:
గొర్లు, బర్రెలను పంచడం కాదు సామాజిక న్యాయం కల్పించాలని సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు.
ఆర్ధిక సమ న్యాయం, సామాజిక హోదా కల్పించడం, రాజకీయాల్లో కూడా అన్ని కులాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడంలో ప్రధాన పార్టీలు విఫలమయ్యాయని అన్నారు. చట్టబద్దమైన హక్కుల కోసం బహుజన లెప్ట్ ఫ్రంట్ పోరాడుతుందని చెప్పారు. కేంద్రం ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన హమీలను తుంగలో తొక్కిండమేగాకుండా తెలంగాణపై కేంద్రం పాక్షపతంగా వ్యవహరిస్తుంది దీనిని మేము ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. అసవరమైతే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి. రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ ఆ పనిచేయకపోతే మిగతా పార్టీలను కలుపుకుని కార్యచరణ ప్రకటిస్తామన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని చెబుతున్నా కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం వైఖరి పట్ల ఎందుకు నోరు మెదపడం లేదు..మోడీ పై హత్య చేయడానికి కుట్ర జరిగిందనేది ప్రచారంకోసమేనని వరవరరావును వేధింపులకు గురి చేయడం సరైందికాదన్నారు.
రాజ్యంగం ప్రకారమే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బహుజన లెప్ట్ ఫ్రంట్ బలోపేతం కోసం ఇప్పటికే 117 నియోజకవర్గాల్లో కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసమే బహుజన లెప్ట్ ఫ్రంట్ ముఖ్య ఉద్దేశం అన్నారు. త్వరలో బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్తామని ఆయన తెలిపారు.