మోత్కుపల్లి పై మంత్రి జవహర్ ఆగ్రహం.

విజయవాడ:
మోత్కుపల్లికి గవర్నరో,రాజ్యసభ సభ్యుడు లాంటి పదవులు లేకపోయేసరికి చంద్రబాబు పై దిగజారుడు వ్యాఖ్యలు చేయటం సరి కాదని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కె.ఎస్.జవహర్ పేర్కొన్నారు. సచివాలయంలోని తన ఛాంబర్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.ముఖ్యమంత్రి చంద్రబాబుకి ప్రియమైన శిష్యుడ్ని అంటూ టీడీపిని విమర్శించటం సరి కాదన్నారు.తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లు..ఏడ్చే మగాడిని నమ్మకూడదు అనే సామెతలను మోత్కుపల్లి నిజం చేశారని మంత్రి గుర్తుచేశారు. రాష్ట్రంలో దళితుల సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్న విషయాన్ని మోత్కుపల్లి తెలుసుకోలేకపోయారు. ప్రధానంగా జీవో నెంబర్ 25 ను పక్కాగా అమలు చేసి మాదిగలను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేస్తున్నామన్నారు. మాదిగ దొరగా పేరొందిన నీవు తెలంగాణలో మందకృష్ణ మాదిగ అరెస్ట్ చేసినప్పుడు ఏమయ్యవని ప్రశ్నించారు. నీ వెనుక ఉండి అడిస్తున్న శక్తులు ఎవరో మాదిగలు సోదరులు గమనించి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. టీఆరెస్, బీజేపీ అజెండా చూసి ధృత రాష్ట్ర పాలన కావాలని మోత్కుపల్లి నర్సింహులు కోరుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికైన తల్లీ పాలు తాగిన టీడీపీకి కృతజ్ఞతతో ఉండకపోతే తీవ్రమైన పరిణామాలకు గురికావాల్సి వస్తుందని మంత్రి జవహర్ ఆగ్రహించారు. తెలంగాణ మంత్రి వర్గంలో మాదిగలకు, మహిళలకు తగిన గుర్తింపు ఇవ్వలేదని తెలిసినా మోత్కుపల్లి నోరు మెదపకుండా ఉన్నారన్నారు.