మోసగాడు అరెస్టు.

హైదరాబాద్:
లాభాలు ఇస్తానని చిన్ననాటి స్నేహితుడు నుండి 2 రెండు కోట్ల 20 లక్షల రూపాయలు తీసుకొని మోసం చేశాడని 2015లో సిసిఎస్ పోలీసులకు మోహన్ రావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.అప్పట్నుంచి శ్వేతలవాడ రవీంద్రబాబు అనే వ్యక్తి తప్పించుకుని తిరుగుతున్నాడు.
ఢిల్లీలో ఉన్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు గత పది రోజుల నుంచి అక్కడే ఉండి నిందితుడు రవీంద్రబాబు అదుపులో తీసుకొని అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరచారు. ఇతనిపై ఒంగోల్, నెల్లూరు, చత్తీస్గడ్, బీహార్ రాష్ట్రాలలో చెక్ బౌన్స్ కేసులలో
వారంట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. రవీందర్ బాబును పోలీస్ కస్టడీలోకి తీసుకుని విచారిస్తామని పోలీసులు తెలిపారు.విచారణలో మరి ఎంతమంది బాధితులున్నారు తెలుస్తుందని సిసిఎస్ అడిషనల్ డీసీపీ జోగయ్య చెప్పారు.