మోహన్ కు నివాళి.

ఆతని పక్కనుంటే
భీమిలి తీరంలో
అలల సవ్వడి
విన్నంత ఆనందం

ఆతని సమీపం
బడభాగ్ని నుండి
బయటపడ్డ స్వేచ్ఛ

ఆయన మాట్లాడుతే
విశ్వప్రయాణం ముగించిన
విజయగర్వం నిగర్వంగా

అలవోకగా చెక్కిన
ప్రతినాయకుడు
నాయకుడు కాని
ప్రేమ పక్షపాతి

ఎరుపంటే ఇష్టం
అయినా ఇతరులకు
కష్టం రాని భావనలు
ఆయనవి వసంత వేళ
ఇరానీ ఛాయి గోల

ఆ. బాలగోపాలం
ఆదరించే మో మై ప్రతిబింబించే
జ్ఞాపకాల జ్ఞానోదయం
చలం చంఛలం వీడి
ఒన్బైటూ లనొదలి
చివరకు ఆర్కే ప్రభాత్ లా
మాంచి కిక్కిచ్చే
సన్మోహనుడు

గద్దరన్న పాట
జెమిని టీవి ఇంట
లెల్లే చిందు గోరటి ఘోష
మద్దెల శాంతన్న శ్వాస
శిఖామణి రాత

అంతా కొత్త పూత పూస్తుంది
ఎందుకో వసంతంపై మల్లీ
మోహనాస్త్రం ప్రయోగించక తప్పదు

అందరూ మోహన్ ని ప్రేమిస్తారు
కానీ మోహన్ నన్నే ఎక్కువ ప్రేమిస్తాడని
బ్రమిస్తాం కానీ ఆయన అందరినీ
చంటి పిల్లాడిగా భావించి
తనూ చంకనెక్కిన పసివాడిలా
మారిపోతాడు..మస్తాన్ శీనుగాడు
వంశీ,శంకర్,మృత్యుంజయ,అన్వర్ భాయ్
అనంత శ్రీరామ్,కుమార్,పాండు,రవి
బ్రహ్మం,ఆంజనేయులు,అవినాష్,ప్రసన్నకుమార్
బండారు సత్యనారాయణ,రాజేశ్వర్ రావు
……………..ప్రేమైక్యం అయిన కోటాను కోట్ల
ప్రేమ జీవులకు మార్గదర్శం
మోహనాస్త్రం

కమలం మెరవంగ
నళిని పిలవంగా
రోషిణి పంచంగా
శైలజ కురవంగా
ప్రకాశించే జీవితం
మోహన్….

ఇది ప్రేరేపించటం కాదు
ప్రేరణకు గురైన ప్రేమకు
చిరు చిహ్నం మాత్రమే

ఆయనను మరిచే
జ్ఞాపకాలు వెంటేసుకుంటే
రోజూ ఉవాచ లా వెంటాడుతుంటాయి
తీపి గుర్తులు వాటిని
పదిలపర్చుకునే
క్రమంలో నేనున్నా
******************!

నేడు
మోహన్ మొదటి వర్ధంతి సభ.
తెలుగు యూనివర్సిటీ.

#శ్రీనివాస్ సత్తురు.