యాదాద్రి వ్యభిచార ముఠాపై చర్యలు ఏమిటి? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు.

హైదరాబాద్:

తెలంగాణ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి మాయని మచ్చగా మిగిలిన వ్యభిచార గృహాల వ్యవహారం హైకోర్టు విచారణ చేపట్టింది.వార్త పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసిన హైకోర్టు. మహిళలను బలవంతంగా వ్యభిచారంలోకి దింపి వ్యాపారం చేస్తున్న ముఠాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో కోర్టుకు తెలుపాలని పోలీస్‌ శాఖకు ఆదేశించింది.యాదాద్రి పోలీస్‌ స్టేషన్‌ ఉన్నతాధికారి మంగళవారం స్వయంగా కోర్ట్‌కు హాజరై ఈ కేసుపై వివరణ ఇవ్వాలని సూచించింది. ‘పొక్సో’ చట్టంతో బాధితులను రక్షించడానికి స్పెషల్‌ టీమ్స్‌ను ఏర్పాటు చేయడంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలుపాలని పేర్కొంది.తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. 52 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ దందాలోకి చిన్నపిల్లలను దింపుతున్న వ్యవహారం ఇటీవల వెలుగు లోకి వచ్చింది.బాలికల శారీరక ఎదుగుదలకు ‘ఆక్సిటోసిన్‌’ ఇంజక్షన్లు ఉపయోగించడాన్ని పోలీసులు గుర్తించారు.