యామినికి గుర్తింపు.

అమరావతి;

టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ను తెలంగాణ యాసను అనుకరిస్తూ చెండాడిన సాధినేని యామిని వీడియో రెండు రాష్ట్రాల్లోనూ వైరల్ అయింది. లక్షలాది మంది ఆ వీడియోను తిలకించారు. ‘కూటమి’ఏర్పాటు పూర్తి కాక ముందే కాంగ్రెస్, టిడిపి జట్టు కట్టడాన్ని వ్యతిరేకిస్తూ కేసీఆర్ ప్రసంగాలు కొనసాగుతుండడంతో యామిని ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కేసీఆర్ పై తన వీడియోలో పెక్కు విమర్శనాస్త్రాలు సంధించి ఇరుకున పెట్టె ప్రయత్నం చేశారు. దీంతో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు యామినిని గుర్తించారు. ఆమెను పార్టీ అధికార ప్రతినిధిగా నియమిస్తున్నట్టు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. కొంతకాలంగా గుంటూరు జిల్లా నుంచి సాధినేని యామిని పార్టీకి అనేక సేవలు అందిస్తున్నారు.