యువకుని ఆత్మహత్య. ప్రేమికులకు హెచ్చరిక.

విజయవాడ:
ప్రేమ కోసమై వలలో పడ్డాడు ఆ యువకుడు. కన్నవారిని, తోబుట్టువులను కూడా నిర్లక్ష్యం చేశాడు. చివరికి ఆ ప్రియురాలి కోసం లక్షల కొద్దీ డబ్బు ఖర్చు చేశాడు. చివరికి ఆ ప్రేయసి ప్రేమ దక్కక పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి ఏం చేయాలో పాల్పోక ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోతూ ప్రేమలో పడొద్దని తోటి యువకులకు సూచిస్తూ రెండు పేజీల లేఖ రాయడంతో పాటు రెండు గంటల నిడివి ఉన్న సెల్ఫీ వీడియోను తీశాడు. ప్రేమలో విఫలం కావడంతో విజయవాడ గవర్నర్ పేటలో వంశీకృష్ణ అనే తెనాలి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన వంశీకృష్ణ.. విజయవాడలోని ఓ ప్రైవేట్ కంపెనీలో సేల్స్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. మూడు రోజుల కిందట గవర్నరుపేట ఆలీబేగ్‌ వీధిలోని ఓ లాడ్జిలో దిగాడు. మంగళవారం మధ్యాహ్నం లాడ్జి సిబ్బందికి కనిపించాడు. రాత్రి 8 గంటలపుడు తలుపులు కొట్టినా తీయకపోవడంతో లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా గదిలో ఉరేసుకుని కనిపించాడు. ప్రేమ కారణంగా తన జీవితం నాశనం అయిందని, యువకులు ప్రేమ విషయంలో జాగ్రత్తగా ఉండాలని తన సూసైడ్ నోట్లో సూచించాడు. ప్రేమ విషయంలో తొందరపడొద్దని చెప్పాడు. ఐ లవ్యూ అమ్మా, ఐ మిస్ యూ అని రాసిన వంశీకృష్ణ ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని తన కుటుంబసభ్యులను కోరాడు. తన గురించి ఆలోచించవద్దని లేఖలో పేర్కొన్నాడు. వంశీకృష్ణ తన తల్లి, సోదరి ఫోన్‌ నంబర్లను లేఖలో పొందుపరిచాడు. తన గురించి ఆలోచించొద్దని పేర్కొన్నారు. తాను పవన్‌ కల్యాణ్‌ అభిమానినని.. ఆయన్ని ఒకసారి కూడా చూడలేదని.. వచ్చే ఎన్నికల్లో పవన్‌ గెలుపొందాలంటూ ఆకాంక్షించాడు. పోలీసులు వంశీకృష్ణ సెల్ఫీ వీడియోను సీజ్ చేశారు.