యువకుని హత్య.

ఖమ్మం:
స్థానిక మేదర్ బజార్ లో కోదాటి ఉపేందర్(32) దారుణ హత్య.మృతుడు శుక్రవారిపేటలో నివాసముంటూ,పెరుమాళ్ల పెట్రోల్ స్టేషన్ లో పనిచేసే వాడు.డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చినపుడు ఘటన జరిగింది. మేదర్ బజార్ లో ఉండే అతని నాయనమ్మ వచ్చి శ్రీను అనే వ్యక్తి తనను తిడుతుండని, వచ్చి మాట్లాడమని కోరగా,ఇంట్లోంచి బయటకు వెళ్లిన ఉపేందర్,శ్రీనుతో మాట్లాడుతుండగా,ఒక్కసారిగా కత్తితో దాడి చేసినట్లుగా తెలుస్తోంది.తీవ్రగాయలతో పడివున్న ఉపేందర్ ని వెంటనే హాస్పిటల్ కి తరలిస్తుండగా మృతి చెందారు.మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు.