యువకుల ఘర్షణ. మహిళ మృతి.

కర్నూలు:
ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణలో మహిళ మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవరర్గంలోని పందికోనలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఓ స్థలం విషయంలో ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణను నిలువరించేందుకు ప్రయత్నించిన మహిళను యువకులు తోసి వేశారు. దీంతో మహిళకు తీవ్రమైన గాయం కావడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.