యువజంట పెళ్లికి పెద్దయిన మిషెల్ ఒబామా.

షికాగో:
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్ సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుందనే విషయం తెలిసిందే. తన కొత్త పుస్తకం ప్రచారం కోసం దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న మిషెల్ ఒబామా అంత ఉరుకులు పరుగులలోనూ ఓ యువజంటకి పెళ్లిపెద్దగా వ్యవహరించి తన పెద్ద మనసు చాటుకొన్నారు. షికాగోకి చెందిన స్టెఫానీ రివ్కిన్, జోయెల్ సర్కస్ ల పెళ్లిని మిషెల్ వాషింగ్టన్ లో ఘనంగా జరిపించింది. సాక్షాత్తూ మాజీ అధ్యక్షుడి భార్య పెళ్లి ప్రమాణాలు చదివించడంతో వేడుకకి హాజరైన అతిథులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఒక అతిథి ఈ పెళ్లి వేడుకను తన మొబైల్ ఫోన్ లో బంధించి ఆ వీడియో క్లిప్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. కానీ కాసేపటికే డిలిట్ చేశారు.