యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది..తాను కూడా ఆత్మహత్యాయత్నం.

హైదరాబాద్:

హైదరాబాద్ లో పట్టపగలే దారుణ ఘటన చోటుచేసుకుంది. పాతబస్తీ ప్రాంతంలో ఓ యువతిపై ప్రేమోన్మాది హత్యాయత్నానికి పాల్పడ్డాడు. యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు ఆ తర్వాత తాను కూడా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అలాగే యువతిని కాపాడటానికి ప్రయత్నించిన ఓ మహిళకు కూడా మంటలు అంటుకోడంతో తీవ్రంగా గాయపడించింది. ఈ దుర్ఘటన పాత బస్తీలోని టప్పాచబుత్రా ప్రాంతంలో చోటుచేసుకుంది. ఇబ్రహీం అనే యువకుడికి కొన్ని రోజుల క్రితం పేస్ బుక్ లో ఈ యువతి పరిచయమైంది. అయితే ఈ పరిచయాన్ని ఆసరాగా చేసుకొని ఇబ్రహీం సదరు యువతిని ప్రేమ పేరుతో వేధించడం ప్రారంభించాడు. దీంతో ఆమె అతడిని దూరం పెట్టింది. దీంతో ఆమెపై ఆగ్రహంతో ఇవాళ ఈ హత్యాయత్నానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది.ఈ పెట్రోల్ మంటల్లో యువతి శరీరం 90 శాతం కాలిపోయింది. మంటల్లో విలవిల్లాడిపోతున్న యువతిని కాపాడటానికి ప్రయత్నించిన ఓ మహిళ కూడా తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం వీరిద్దరు ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హైటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.