యువతి వంచన. సాఫ్ట్ వేర్ యువకుని బలి!!


Hyderabad:

ఇతని పేరు మాచిడు అఖిల్ రెడ్డి. 2015 నుండి ఓ అమ్మాయిని మనసారా ప్రేమించాడు… నాలుగేళ్లు కలిసి తిరిగారు… అమ్మాయి అమ్మకు కూడా వీరి ప్రేమ వ్యవహారం తెలుసు… తను కూడా వీరి ప్రేమకు అంగీకారం తెలిపింది. 2015 లో మొదలైన వీరి ప్రేమ 2019 ఫిబ్రవరి వరకు సజావుగా సాగింది. కలిసి తిరగడం ఒకటా రెండా అమ్మాయి ప్రేమను నిజమని నమ్మిన అఖిల్ రెడ్డి తను కష్టంలో ఉందన్న ప్రతిసారీ చివరకి అమ్మాయి తండ్రి చనిపోయిన సందర్భంలో కూడా వారి కుటుంబానికి పెద్దదిక్కుగా ఉండి ఆర్థికంగా,మానసికంగా వెన్నుదన్నుగా నిలిచాడు. కానీ అఖిల్ రెడ్డి ప్రేమను అమ్మాయి తల్లి, అమ్మాయి ఒక మంచి అవకాశంగా భావించి పలు దఫాలుగా అధిక మొత్తంలో నగదు పొందారు… అఖిల్ రెడ్డి ప్రేమను ఒక ఏటీఎమ్ గా భావించారు. కానీ అఖిల్ మాత్రం ఎప్పుడూ వీరి కుట్రను గుర్తించ లేదు. ఎందుకంటే తను ప్రేమా అనే లోకంలో అలాగే ఉండిపోయాడు. నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నాం కదా ఇక పెళ్లితో ఒకటవుధాం అని అమ్మాయికి చెప్పాడు… ఇక అప్పటి నుండి అమ్మాయి క్రమంగా అఖిల్ ని దూరంగా పెడుతూ కుంటి సాకులు చెబుతూ ఫోన్ లో మరో వ్యక్తితో మాట్లాడుతూ ఆ వ్యక్తితో అఖిల్ కి హ్యాండ్ ఇస్తు వచ్చింది. తన ప్రియురాలు ప్రియురాలు కుటుంబం తనని మోసం చేస్తున్న విషయాన్ని చాలా లేటుగా గ్రహించిన అఖిల్ వారి కుటుంబాన్ని కలిసి జరిగింది అంతా చెబుతూ తనను మోసం ఎందుకు చేస్తున్నారు ఇలా నేను చేసిన పాపం ఎంటి మిమ్మల్ని నమ్మి గుడ్డిగా ప్రేమించడమే నేను చేసిన నేరమా అని సాక్షాలతో సహా నిలదీశాడు… దీంతో ఒక్కసారిగా కంగుతిన్న అమ్మాయి, అమ్మాయి తల్లి, కుటుంబం. ఏం చేసుకుంటావో చేసుకో నేను నిన్ను పెళ్లి చేసుకోను అంటూ అమ్మాయి అఖిల్ మొహం మీద చెప్పింది. అక్కడే ఉన్న అఖిల్ తల్లి తండ్రులు అమ్మాయి కాళ్ళ మీద పడి ప్రాధేయపడ్డారు… అమ్మ మావాడిని పెళ్లి చేసుకో అంటూ బతిమిలాడారు అయిన వినలేదు చివరికి అఖిల్ తోబుట్టువు కూడా కాళ్ళ పై పడి ప్రాధేయపడింది అయినా అంతే ఫలితం. ఇక చేసేది లేక అమ్మాయి బంధువులకు జరిగిన విషయం చెప్పాడు వారు ఇలా చెయ్యడం తప్పు ఎందుకు అబ్బాయితో తిరిగావు ఇప్పుడు ఎందుకు అతన్ని మోసం చేస్తున్నావ్ అని ప్రశ్నించారు. అంతే ఒక్కసారిగా ఓ రోజు అఖిల్ ఇంటికి వచ్చి అఖిల్ అమ్మ కాళ్ళ పై పడి అఖిల్ ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి వెళ్ళింది. ఇక ఆ తెల్లారి అమ్మాయి ఆర్య సమాజ్ లో మరో అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఈ విషయం తెలిసిన అఖిల్ తను ఎంతో గాఢంగా ప్రేమించిన అమ్మాయి తనను అంతకంటే ఘోరంగా మోసం చేసింది అనే విషయం తెలిసి తీవ్రంగా కుంగిపోయాడు… ఒక అబ్బాయి మోసం చేస్తే నాన యాగి చేసి శిక్షించే సమాజం, మీడియా,చట్టాలు తీరా ఒక అమ్మాయి మోసం చేస్తే ఎందుకు ప్రైక్షకపాత్ర వహిస్తున్నాయి. ఎందుకు మౌనంగా ఉంటున్నాయి అమ్మాయి అయితే ఒక న్యాయం, అబ్బాయి అయితే ఒక న్యాయమా… అంటూ పలువురిని కలిసి ప్రశ్నించాడు. అబ్బాయి మోసం చేస్తే ఏ శిక్ష విధిస్తారో అమ్మాయి మోసం చేసిన అలాగే శిక్షించాలి అని తన చివరి కోరికను తన సూసైడ్ నోట్ లో రాశాడు… అంతేకాదు తనను అమ్మాయి అమ్మాయి తల్లి ఏ విధంగా మోసం చేశారు తనకు అమ్మాయి ప్రేమకు సాక్షాలుగా ఉన్న వాటిని కూడా పొందు పరిచాడు. ఇక ఈ మోసాన్ని నేను తట్టుకొని జీవించలేను, నేనే నన్ను మోసం చేసిన వారిని చంపి శిక్షించవచ్చు కానీ, సమాజం అయ్యో అమ్మాయి పాపం అంటుందే కానీ నా ప్రేమను బాధను పట్టించుకోదు. లింగ వివక్ష ఉండకూడదు అనే సమాజం ఇలాంటి విషయాల్లో ఎందుకు అలా వ్యాహరిస్తున్నయి… ఈ విధమైన అమ్మాయిల మోసాలు నాతోనే ఆగిపోవాలి అంటూ తన నాలుగేళ్ల సుధీర్ఘ ప్రేమకు తను ఎలా మోసపోయాడు లాంటి వివరాలను తన డిమాండ్ ను నాలుగు పేజీల సూసైడ్ నోట్ రూపంలో మన ముందు ఉంచి ఈ నెల 3వ తేదీన అమీర్ పేటలో తను పని చేస్తున్న సాఫ్ట్వేర్ కార్యాలయంలో తన ఛాంబర్ లో ఆత్మహత్య చేసుకున్నాడు అఖిల్. అఖిల్ ఆత్మకు శాంతి కలగాలి అన్నా ఒక అబ్బాయిని మోసం చేయాలని చూడలకునే అమ్మాయిలు మారతారు. సమాజం ఇప్పటికైనా అమ్మాయి మోసం చేసిన ప్రశ్నించే తత్వం రావాలి అప్పుడైనా ఇలాంటి ఘోరాలు జరగకుండా ఉంటాయి.