యోగి సమక్షంలో రమణ్ సింగ్ నామినేషన్!

రాయపూర్:
ఛత్తీస్ గఢ్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు డా.రమణ్ సింగ్ రాజ్ నంద్ గావ్ నుంచి తన నామినేషన్ వేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో ముఖ్యమంత్రి డా. రమణ్ సింగ్ తన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. నామినేషన్ సమయంలో ఆయనతో ఆయన భార్య, ఎంపీ అభిషేక్ సింగ్, ఇతర పార్టీ నేతలు ఉన్నారు. నామినేషన్ దాఖలుకు ఆఖరు రోజున సీఎం డా. రమణ్ సింగ్ తన పత్రాలు నింపారు. రాజ్ నంద్ గావ్ నుంచి బీజేపీ తరఫున డా. రమణ్ సింగ్ పోటీ చేస్తుండటం ఇది మూడో సారి. రాజ్ నంద్ గావ్ జిల్లాలో మొత్తం 6 సీట్లకు నామినేషన్ల దాఖలు ప్రక్రియను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ పర్యవేక్షించారు. ఇవాళ ఒక బహిరంగ సభలో యోగి ప్రసంగించనున్నారు.