రక్షణ శాఖలో ‘డొల్ల’. డీఆర్డీవో పనిచేస్తున్న పాక్ ఏజెంట్ అరెస్ట్!!

నాగపూర్:
భారతీయ రక్షణ సంస్థలో మరో అతిపెద్ద పొరపాటు వెలుగు చూసింది. మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో ఉన్న డీఆర్డీవో యూనిట్ లో పాకిస్థాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)కి చెందిన ఒక ఏజెంట్ ని అరెస్ట్ చేశారు. అరెస్టయిన ఏజెంట్ బ్రహ్మోస్ యూనిట్ లో పని చేసేవాడు. ఈ గూఢచారి డీఆర్డీవోకి చెందిన అత్యంత రహస్య సమాచారాన్ని ఐఎస్ఐకి అందజేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంపై నాగ్ పూర్ పోలీసులు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు యూపీ ఏటీఎస్ ఈ ఉదయం నాగ్ పూర్ లో మరో ఏజెన్సీతో కలిసి ఈ గూఢచారిని అరెస్ట్ చేసింది. ఈ ఏజెంట్ పేరు నిశాంత్ అగర్వాల్ అని తెలుస్తోంది. ఇతను నాగ్ పూర్ లోని డీఆర్డీవో యూనిట్ లో చాలా కాలంగా పని చేస్తున్నట్టు సమాచారం.