రవిప్రకాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణ!!

రవిప్రకాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణ!!

hyderabad :

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌‌ను హైకోర్టు తిరస్కరించింది. అరెస్ట్ చేస్తారనుకుంటే మళ్లీ రావాలని హైకోర్టు సూచించింది. సీఆర్‌పీసీ 154 ప్రకారం విచారణ జరపాలని రవిప్రకాష్ తరపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే.. అంత అత్యవసరం కాదని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ‘అలంద మీడియా’ సంస్థ డైరెక్టర్‌ కౌశిక్‌రావు ఫిర్యాదు మేరకు ఈ నెల 9న రవిప్రకాశ్‌ ఇంట్లో సైబర్‌ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆయనపై ఫోర్జరీ, డేటాచోరీ కేసులు నమోదు చేశారు.దాడులు జరిగిన నాటి నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దాంతో వెంటనే పోలీసులు ముందు హాజరుకావాలని ఇప్పటికే రెండుసార్లు 160 సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేశారు. 41 సీఆర్‌పీసీ నోటీసు గడువు బుధవారంతో ముగియనుంది. దీంతో ఆయన పోలీసుల ఎదుట స్వచ్ఛందంగా విచారణకు హాజరవుతారా? లేక అరెస్టవుతారా? అన్నా అంశంపై ఉత్కంఠ కొనసాగుతున్నది.