‘రసమయి గో బ్యాక్’ మానకొండూరులో నిరసన.


కరీంనగర్:
మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు ఘోర పరాభవమెదురైంది. ఇల్లంతకుంట మండలం ముస్కాన్ పేటలో బతుకమ్మ సంబరాల్లో పాల్గొనేందుకు వచ్చిన ‘రసమయి గోబ్యాక్’ అంటూ జనం పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో టీఆర్ఎస్ కార్యకర్తలు, గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దాంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ముస్కాన్ పేటకు గతంలో అంబేద్కర్, పూలే విగ్రహాలు ప్రతిష్ఠించినప్పుడుగానీ, ఇతర సమస్యలు పట్టించుకునేందుకుగానీ, ఈ నాల్గున్నరేళ్లలో ఒక్కసారి కూడా రాని నువ్వు ఇప్పుడు బతుకమ్మ సంబరాల పేరిట ఓట్లు కొల్లగొట్టేందుకు వచ్చావా అంటూ పలువురు ప్రశ్నించడంతో రసమయి ఖంగుతిన్నాడు. తన నియోజకవర్గంలో ఇప్పుడిప్పుడే తన ప్రచారం ముమ్మరం చేస్తున్న క్రమంలో రసమయికి ఈరోజు ముస్కాన్ పేటలో జరిగిన అవమానంతో చుక్కలు కనిపించాయి.