రాకేష్ ఆస్థానా @ భారీ కుంభకోణం!!

ప్రకాశ్,న్యూఢిల్లీ:

సీబీఐకి చెందిన ఇద్దరు అత్యున్నత అధికారులు ఆలోక్ వర్మ, రాకేష్ ఆస్థానా మధ్య మొదలైన కోల్డ్ వార్ చరమ దశకు చేరింది. ఇప్పుడిప్పుడే ఆస్థానా లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. సూరత్ లో పని చేస్తున్నపుడు ఆస్థానా పోలీస్ సంక్షేమ నిధికి చెందిన రూ.20 కోట్లను ఎన్నికల చందాగా ఇచ్చారు.సూరత్ కి చెందిన రిటైర్డ్ పీఎస్ఐ 23 అక్టోబర్ నాడు సీబీఐకి ఒక ఈమెయిల్ పంపారు. ఆ ఈమెయిల్ లో ఆస్థానా గురించి నివ్వెరపోయే నిజాలను చెప్పారు. ఆస్థానా పోలీస్ వెల్ఫేర్ ఫండ్ నుంచి రూ.20 కోట్లు బీజేపీకి ఎన్నికల చందాగా అందజేశారు. 2013-15 ఆర్థిక సంవత్సరాలలో సూరత్ పోలీస్ అకౌంట్ కి ఈ మొత్తం తిరిగి రాలేదు. ఆ సమయంలో నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. సూరత్ పట్టణంలో పోలీస్ కమిషనర్ గా ఉన్న రాకేష్ ఆస్థానా హయాంలో జరిగిన అతిపెద్ద గోల్ మాల్ ఇది.రిటైర్డ్ పీఎస్ఐ ఈమెయిల్ ప్రకారం పోలీస్ వెల్ఫేర్ కి చెందిన రూ.20 కోట్ల ట్రాన్స్ ఫర్ కి సంబంధించిన టీడీఎస్ చెల్లించాల్సిందిగా ఆదాయపన్ను శాఖ నోటీసులు ఇ్చింది. ఆ తర్వాత కార్యాలయం నుంచి పోలీస్ వెల్ఫేర్ ఫండ్ కి సంబంధించిన పత్రాలు మాయమయ్యాయి. దీని గురించి సూరత్ క్రైమ్ బ్రాంచ్ కి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారాన్ని ఆడిట్ విభాగం దృష్టికి కూడా తీసుకెళ్లారు.2015లో ఆర్టీఐ కింద ఈ వ్యవహారానికి సంబంధించిన సమాచారం కోరితే ఇవ్వలేదని పట్టణానికి చెందిన ఆర్టీఐ కార్యకర్తలు షేక్ మొహ్మద్, సొహైల్ మొహమ్మద్ అమీన్ చెప్పారు.