రాగల మూడు రోజుల వరకు వాతావరణం.

హైదరాబాద్:
పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ ఒరిస్సా, ఉత్తర కోస్తాంధ్ర పరిసర ప్రాంతాలలో 7.6 km ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం తెలిపింది.
తెలంగాణ:
అక్కడక్కడ ఉరుములు, ఈదురుగాలులతో పాటు తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రం లో కురిసే అవకాశం ఉంది.

కోస్తా ఆంధ్ర:
అక్కడక్కడ ఉరుములు, ఈదురుగాలులతో పాటు తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు రాగల మూడు రోజులు కోస్తా ఆంధ్ర లో కురిసే అవకాశం ఉంది.
ఈరోజు, రేపు కోస్తా ఆంధ్ర లో కొన్ని ప్రాంతాలలో వడగాల్పు లు వీచే అవకాశం ఉంది. మరియు గరిష్ట ఉష్ణోగ్రతలు సుమారుగా 40 నుండి 42 డిగ్రీలు మరియు సాధారణం కన్నా 3 నుండి 4 డిగ్రీలు సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఎక్కువగా కోస్తా ఆంధ్ర లో కొన్నిచోట్ల నమోదు అయ్యే అవకాశం ఉంది.

రాయలసీమ:
అక్కడక్కడ ఉరుములు, ఈదురుగాలులతో పాటు తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు రాగల మూడు రోజులు రాయలసీమ లో కురిసే అవకాశం ఉంది.