రాజన్న కు కేసీఆర్ శఠగోపం.

వేములవాడ:
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ని ముఖ్యమంత్రి కేసీఆర్ 3 సంవత్సరాల క్రితం దర్శించుకొని దేవాలయ అభివృద్ధికి, నియోజకవర్గo అబివృద్దికి సంబంధించి ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేవస్థానం మెట్ల దగ్గర నిరసన తెలిపింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ,ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.
దేవాలయం పైన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇచ్చిన హామీలను నెరవర్చకుండా ప్రజలకు శఠగోపం పెట్టినట్టే దేవునికి కేసీఆర్ శఠగోపం పెట్టినట్టు విమర్శించారు వెంటనే ప్రభుత్వం స్పందించి హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్యనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు