రాజాం లో ‘గ్రీష్మ’ఋతువు

తన కుమార్తె గ్రీష్మ రాజకీయ భవిష్యత్తుపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, శాసనమండలి సభ్యురాలు ప్రతిభాభారతిఫోకస్‌ పెట్టారు. ఎలాంటి రాజకీయ అనుభవమూ లేకున్నా సీనియర్లను కాదని తన కూతురు గ్రీష్మకు రాజాం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్‌పర్సన్‌ పదవిని కట్టబెట్టి విమర్శల పాలయ్యారు. ప్రస్తుతం నియోజకవర్గం బాధ్యతలన్నీ తన కూతురు గ్రీష్మ చూసుకుంటుండంతో ప్రతిభాభారతి క్రియాశీలంగా కనిపించడం లేదు. వచ్చే ఎన్నికలలో గ్రీష్మను ఎలాగైనా అసెంబ్లీ బరిలో నిలపాలని ప్రతిభాభారతి భావిస్తున్నారు. నియోజకవర్గంలో ఏ చిన్న పని చేయించుకోవాలన్నా గ్రీష్మ అనుమతి తప్పనిసరి కావడంతోసుదీర్ఘ కాలంగా తెలుగుదేశం పార్టీ విధేయులుగా కొనసాగుతున్న కార్యకర్తలు ఈ పరిణామాలపై ఆవేదన చెందుతున్నారు.

శ్రీకాకుళం;
జిల్లాలో ప్రతిభాభారతిపేరు తెలియని వారు ఉండరు. టిడిపి అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ ఆమెకు ఉన్నత పదవులు అదృష్టం ఆవరించినట్టే వచ్చి పడ్డాయి. అంతటి నాయకురాలు ఇపుడు పొలిటికల్ రన్ లో వెనుకబడ్డారు ?ఆమె వేగం తగ్గింది. శ్రీకాకుళం జిల్లా మొదటి నుంచీ టిడిపికి కంచుకోటగా ఉన్నది. ఆ జిల్లాలోని రాజాం అసెంబ్లీ నియోజకవర్గం కూడా టిడిపికి కంచుకోటే.కానీ వరుసగా రెండుసార్లు ప్రతిభాభారతి ఓటమి పాలయ్యారు. అయినా ఈ సీనియర్ రాజకీయ నాయకురాలి పనితీరులో మార్పు రావదం లేదు. తెలుగుదేశంపార్టీ ఆవిర్భావం నుంచి శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్నారు. రాష్ట్రమంతటాకాంగ్రెస్‌పార్టీ పవనాలు వీచిన సందర్భాలలోనూ ఇక్కడి ప్రజలు మాత్రం టీడీపీతోనే ఉన్నారు. దీనికి తోడు ఈ జిల్లా నేతలు అటు ప్రభుత్వంలోనూ, ఇటు పార్టీలోనూ కీలకపాత్ర పోషిస్తూ వచ్చారు. భౌగోళికంగా వెనుకబడిన జిల్లానే అయినా ఇక్కడి ప్రజలకు మాత్రం రాజకీయచైతన్యంఎక్కువ.శ్రీకాకుళం జిల్లాలో పేరు మోసిన రాజకీయ నాయకులకుకొరత లేదు. పార్టీకి విశ్వాసపాత్రులైన వారికి అటోమాటిక్‌గా ఉన్నత పదవులు లభిస్తాయి.కానీ తేడా జరిగితే రాజకీయ భవిష్యత్తు లేకుండా పోతుంది. ఇదంతా తెలిసి కూడా జిల్లాలో కొంతమంది నేతలు తీరు మార్చుకోవడం లేదు. జిల్లాలో రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలలో రాజాం ఒకటి! వాణిజ్య కేంద్రంగా పేరుగాంచిన రాజాం నియోజకవర్గంలో ప్రస్తుతం అధికారపార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కుంటున్నది. ఈ నియోజకవర్గంలో పూర్వపు ఉనుకూరు నియోజకవర్గంలో ఉన్న రాజాం, రేగిడి, వంగర మండలాలతో పాటు పాలకొండ నియోజకవర్గంలోనిసంతకవిటి కూడా ఉన్నాయి. తాజా రాజకీయ పరిణామాలు తెలుగు తమ్ముళ్లను తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశంపార్టీలో ఉంటూ ఉన్నత పదవులను అధిరోహించిన కావలి ప్రతిభాభారతి ప్రస్తుతం రాజాం అసెంబ్లీ నియోజకవర్గఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. ఓటమి గుణపాఠం నేర్పుతుందంటారు. కానీ రెండుసార్లు ఓటమి చవి చూసినా స్థానిక టీడీపీ నేతలలో మాత్రం ఏ మార్పు కనిపించడం లేదన్న భావన క్యాడర్‌లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రాజాం నియోజకవర్గానికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీకి చెందిన కంబాల జోగులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం బలంగా ఉన్నప్పటికీ పార్టీని సమర్ధంగా నడిపే నాయకులు కరువయ్యారు. కంబాల జోగులు ఎమ్మెల్యే అయినా రాజకీయాలను శాసించగల శక్తి ఆయనకు లేదు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు ఇలాంటి బలహీనతలు ఉన్నప్పటికీ టీడీపీ దాన్ని సొమ్ము చేసుకోలేకపోతోంది. ప్రతిభాభారతి వైఖరిపై అసంతృప్తితో కొందరుముఖ్య కార్యకర్తలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. రెండుసార్లు ప్రతిభాభారతి పరాజయం చెందినా,ఆమె సేవలకు గుర్తింపుగా అధిష్టానం ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చింది. అయితే ఈ పదవి పార్టీ బలోపేతానికంటే కొంతమంది ఆర్ధిక బలోపేతానికే ఉపయోగపడిందన్న విమర్శలు వినిపించాయి. ప్రస్తుతం ప్రతిభాభారతి తన కుమార్తె గ్రీష్మా శ్రీకాంత్‌ రాజకీయ భవిష్యత్తుపైనే ఎక్కువ ఫోకస్‌ పెట్టారు. ఎలాంటి రాజకీయ అనుభవమూ లేకున్నా సీనియర్లను కాదని తన కూతురు గ్రీష్మకు రాజాం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్‌పర్సన్‌ పదవి కట్టబెట్టడం విమర్శలకు దారితీస్తున్నది. రాజకీయ అనుభవంతో పాటు, రాజకీయ వ్యూహరచనలో ప్రతిభకు మంచి అనుభవం ఉంది. అయితే ప్రస్తుతం నియోజకవర్గం బాధ్యతలన్నీ తన కూతురు గ్రీష్మ చూసుకుంటూ ఉండడంతో ప్రతిభాభారతి క్రియాశీలంగా పనిచేయడం లేదు. వచ్చే ఎన్నికలలో గ్రీష్మను ఎలాగైనా అసెంబ్లీ బరిలో నిలపాలని ప్రతిభాభారతి భావిస్తున్నారు. ఇదిలా ఉండగా రాజాంనియోజకవర్గంలో ఏ చిన్న పని జరగాలన్నా గ్రీష్మ అనుమతి తప్పనిసరి. పార్టీకి విధేయులుగా ఉంటూ వస్తున్న కార్యకర్తలు మాత్రం ఈ పరిణామాలతో ఆవేదన చెందుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే కంబాల జోగులు తమ పార్టీ అధిష్టానం అండతో కార్యక్రమాలనుముమ్మరం చేశారు. ఇలాంటి సమయంలో తమ పార్టీ అధికారంలో ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నామనే నిర్వేదం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలలో ఏర్పడింది.