రాజీనామాలపై రాజీ లేదన్నవైసిపి,రాజీనామాలు ఆమోదం పొందినందున ఉప ఎన్నికలు తప్పవన్న ఎం.పీ. లు.

ఢిల్లీ:
తమ రాజీనామాలు ఆమోదం పొందినట్లు వైసిపి పార్లమెంట్ సభ్యులు ప్రకటించారు.స్పీకర్ సుమిత్రా మహాజన్ మళ్ళీ రాజీనామాలు గురించి అడిగారని తమ నిర్ణయం లో ఎలాంటి మార్పు లేదని స్పీకర్ కి వివరించామని వై.ఎస్.ఆర్.సి.పి.ఎంపి లు స్పష్టం చేశారు.మరొక సారి మళ్ళీ ఒక్కొక్కరుగా రీ కాంఫైర్మ్ లెటర్ ఇవ్వండి అని స్పీకర్ చెప్పారని తెలిపారు.
దాదాపు స్పీకర్ మా రాజీనామాలు ఆమోదం చేసినట్లే నని వారు అభిప్రాయపడ్డారు.ఉపఎన్నికలు వస్తాయి కాబట్టి ప్రజల వద్దకు వెళతామని చెప్పారు.ఫిరాయింపు ల ఎమ్మెల్యే ల తో కూడా రాజీనామా చేపిస్తే అందరూ కలసి బై ఎలక్షన్ కి వెళ్దామని ఎం.పీ లు సవాలు చేశారు.టీడీపీ హోదా విషయంలో పూర్తిగా విఫలం అయ్యిందన్నారు.ఉప ఎన్నికలకు వెళ్లి ప్రజలచే మళ్ళీ గెలుస్తామన్నారు.పచ్చ కామెర్ల ఉన్న వారికి లోకం మొత్తం పచ్చగా కనిపిస్తుందని వైసీపీ ఎం.పీ లు విమర్శించారు.చంద్రబాబు కి డ్రామాలు చేయడం బాగా అలవాటు అయ్యిందన్నారు.సొంత రాజకీయాల కోసం తమ మీద బురద చల్లే మాటలు మాట్లాడుతున్నారని అన్నారు.ఫిరాయింపు ఎమ్మెల్యే లతో రాజీనామా లు చేయించాలని సవాలు చేశారు.4 సంవత్సరాలు గా అవినీతి పాలన కొనసాగిందన్నారు.వైసీపీ పార్టీ ఎన్నికలకు భయపడదన్నారు.జగన్ ధైర్యవంతుడని అన్నారు.దేశంలో అవినీతి పాలన చంద్రబాబు ప్రభుత్వందేనని అన్నారు.అబద్దాల మీద పునాదులు వేసి అధికారంలో చంద్రబాబు కూర్చున్నాడని చెప్పారు.జగన్ మొదటి నుంచి ఏపీ కి హోదా కావాలని చెబుతున్నారని గుర్తు చేశారు.చెప్పిన మాట మీద జగన్ నిలబడతారని అన్నారు.చంద్రబాబు, లోకేష్ ఇద్దరు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎం.పి. మిథున్ రెడ్డి విమర్శించారు.వైసీపీ రాజినామాలు పెద్ద డ్రామా అని లోకేష్ చెప్పడం హాస్యాస్పదం అని ఆయన అన్నారు.సంతలో పశువులు కొన్నట్లు ఎమ్మెల్యే లను కొనుగోలు చేశారని ఆరోపించారు.ప్రజలను నమ్ముకొని రాజకీయలు చేస్తున్నామని అన్నారు.