‘రాఫెల్’ కుంభకోణం మలుపు. ఫ్రాన్స్‌ అధ్యక్షుని వ్యాఖ్యలు.

పారిస్:

వివాదాస్పద రాఫెల్ ఒప్పందంపై ఫ్రాన్స్ ప్రస్తుత అధ్యక్షుడు ఇమాన్యుల్‌ మెక్రాన్ ఇచ్చిన వివరణతో డీల్‌పై క్లారిటీ రావడానికి బదులు.. మరిన్ని అనుమానాలు రేకెత్తాయి. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం గురించి మాట్లాడుతూ ‘ప్రభుత్వానికి- ప్రభుత్వానికి’ మధ్య కుదిరిన ఒప్పందమని ఆయన పేర్కొన్నారు. భారత్- ఫ్రాన్స్ మధ్య ఒప్పందం జరిగిన సమయంలో తాను అధికారంలో లేనని ఆయన తప్పించుకున్నారు. మాజీ అధ్యక్షుడు హోలెండ్‌ అన్న మాటలను మాత్రం ఖండించలేదు. ఐరాస సర్వసభ్య సమావేశం సందర్భంగా మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ఆయన ఈ మేరకు స్పందించారు.