రాఫెల్ కొనుగోలుకు 10 రోజుల ముందే కళ్ళు తెరచిన కంపెనీ అంబానీ .

 

న్యూఢిల్లీ:

రాఫెల్ విమానాల కొనుగోలు ఒప్పందంలో అనేక లొసుగులు ఉన్నాయని మాజీ మంత్రి జైపాల్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. రాఫెల్ ఫైటర్ల కొనుగోలుపై 2015లో మోడీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడానికి ముందు ఎలాంటి పరిశీలనా జరగలేదన్నారు. ఒప్పందం కుదుర్చుకున్నాక రక్షణశాఖ పరిశీలనకు పంపినట్టు తెలిపారు. రక్షణశాఖ జాయింట్ సెక్రటరీ రాజీవ్ వర్మ ఈ ఒప్పందం తెలిపారని జైపాల్ రెడ్డి వెల్లడించారు. ఆ అభ్యంతరాన్ని అదనపు సెక్రటరీగా ఉన్న స్మితా నాగరాజ్ తోసిపుచ్చినందుకు ప్రతిఫలంగా ఆమెను యుపీఎస్సీ సభ్యురాలిగా నియమించారని చెప్పారు. గతంలో అనేక విమానాల తయారీ, సర్వీసుని అందించిన అనుభవం ఘనత ఉన్న హెచ్ఏఎల్ ని కాదని అనిల్ అంబానీకి కాంట్రాక్ట్ కట్టబెట్టారని ఆరోపించారు. సుమారు పదివేల ఉద్యోగాలను కల్పించిన ప్రభుత్వ రంగ సంస్థ హెచ్ఏఎల్ కి లేని సామర్థ్యం ఒప్పందానికి పది రోజుల ముందు స్థాపించిన అనిల్ అంబానీ కంపెనీకి ఎలా వచ్చిందని జైపాల్ రెడ్డి ప్రశ్నించారు.