రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గాలి!

మహబూబ్ నగర్:
“రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తున్నది. ప్రజల అభిమానాన్ని ప్రేమను చూరగొంటున్న ది. టిఆర్ఎస్ పార్టీని పాతిపెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నార”ని ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. ఐదేళ్లు పాలించడానికి ప్రజలు పట్టం కడితే పాలన చేతకాక ముందే దిగి పోయిన దద్దమ్మ కేసీఆర్ అంటూ ఎమ్మెల్యే అరుణ విమర్శించారు. ప్రజలను మాయ మాటలలో పెట్టేసి రాష్ట్రంలో అవినీతి పాలన సాగించి పెద్ద ఎత్తున దోచుకున్నారని విమర్శించారు. దోచుకున్న డబ్బుతోనే నేడు ఎన్నికలలో అడ్డగోలుగా ఖర్చు పెట్టి గెలుస్తామనే ఏదైతే ఉందో తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి గద్దె దించేందుకు కంకణబద్ధులుగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని పక్షాలు ఏకమై టిఆర్ఎస్ పార్టీకి బొంద పెట్టడానికి ఏకైక అజెండాతో ఉన్నారన్నారు. టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అప్పులు పాలు కావడంతో పాటు వనరులన్నీ దోచుకుపోయే పరిస్థితి ఉందన్నారు. తెలంగాణ బానిసత్వం పోవాలంటే కెసిఆర్ అందించాల్సిన అవసరం ఉందన్నారు. రాజీనామా చేసినప్పటికీ అధికారంలో ఉన్నామనే దురహంకారాన్ని టిఆర్ఎస్ పార్టీ చూపిస్తుందన్నారు. టిఆర్ఎస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయి రోజురోజుకు రోజులు లెక్కించు కుంటూ పోవాల్సింది అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినవెంటనే మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అన్నింటిని అమలు చేస్తామని అన్నారు కాంగ్రెస్ పార్టీ అమలు చేసే సంక్షేమ పథకాలు పథకాలను తీసుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలని ఆమె సూచించారు ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు గడ్డం కృష్ణారెడ్డి,మున్సిపల్ చైర్ పర్సన్ టి. క్రిష్ణ వేణి రామాంజనేయులు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ యూత్ సెక్రెటరీ డి.కె. స్నిగ్ద రెడ్డి,కాంగ్రెస్ పార్టీ మహిళ జిల్లా అధ్యక్షురాలు పద్మావతి వెంకట రాములు , మండల అధ్యక్షుడు పుడూర్ నరేందర్ రెడ్డి, ఎంపీటీసీ రాధాకృష్ణ రెడ్డి,పిఎసిఎస్ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి ,లీగల్ సెల్ అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ మాజీ సర్పంచులు నాయకులు ఉన్నారు