రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి ఎత్తేయాలి.

న్యూఢిల్లీ:
వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్‌ బిల్లుకు టీడీపీ మద్దతిస్తోందని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు లోక్ సభలో ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తున్నపుడు ఓబీసీలకు కూడా అదే విధానం అమలు చేయాలని కోరారు. కులాలవారీగా జనాభా లెక్కలను ఎప్పుడు బహిర్గతం చేయలేదని ఆయన అన్నారు. దేశంలో ఎన్ని ఓబీసీ కులాలు ఉన్నాయో ఎవరికీ తెలియదని వ్యాఖ్యానించారు. అయితే ఈ బిల్లులోని క్రీమీ లేయర్ నిబంధనకు తాము వ్యతిరేకమని తెలిపారు. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితిని ఎత్తేయాలని కోరారు.