రిజర్వేషన్ల పై ప్రభుత్వం కుట్రలు.

హైదరాబాద్:
బీసీలకు రిజర్వేషన్లు పెరగకుండా తెలంగాణ ప్రభుత్వమే కుట్రలు పన్ని అడ్డుపడుతోందని ఆరోపించారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క. రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా చూడమని సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశించిందని గుర్తు చేసిన భట్టి, రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం కుంటిసాకులు చెబుతోందని విమర్శించారు. జనాభా లెక్కలు తేల్చమన్న కోర్టు ఆదేశాలు పాటించకుండా వారికి అన్యాయం చేసిందని మండిపడ్డారు. తెలంగాణ సర్కార్ భారీ వ్యయప్రయాసలతో జరిపించిన సమగ్ర కుటుంబ సర్వే గణాంకాలను ఎందుకు ప్రకటించడం లేదని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. కోర్టు ఆదేశాల ప్రకారం జనాభాను అనుసరించి ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం కొన్ని సాకులను అడ్డుగా పెట్టుకొని పంచాయతీ ఎన్నికలను నిర్వహించకుండా కాలక్షేపం చేస్తోందని భట్టి దుయ్యబట్టారు.