రూ.60,000 వడ్డీ లేని రుణాలిస్తున్న అమెజాన్, ఫ్లిప్ కార్ట్.

ప్రకాశ్, న్యూఢిల్లీ:
పెద్ద పండుగ దసరా వచ్చేసింది. ఈ పండుగకి ఏదైనా మంచి స్మార్ట్ ఫోన్ కానీ, పెద్ద ఎల్ఈడీ టీవీ కొనేందుకు చేతిలో సరిపడా డబ్బుల్లేవా? ఏం ఫర్వాలేదు. మీకు నచ్చిన వస్తువేదైనా కొనేయండి. ఎందుకంటే దేశంలో అతిపెద్ద ఆన్ లైన్ రీటెయిలింగ్ కంపెనీలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ పలు ఆకర్షణీయ పథకాలను ప్రకటించాయి. రూ.60,000 వరకు కొనుగోళ్లకు వడ్డీ లేని రుణాలను అందిస్తున్నాయి. కొత్తగా 10 కోట్ల మంది వినియోగదారులను ఆన్ లైన్ కొనుగోళ్లకు ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కొత్త చెల్లింఉ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్టు కంపెనీలు చెబుతున్నాయి.ఫ్లిప్ కార్ట్, అమెజాన్ మొబైల్ యాప్ ద్వారా కస్టమర్లు ఈ రుణం పొందవచ్చు. యాప్ కి సైన్ అప్ చేసిన తర్వాత వినియోగదారులు తమ పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ నెంబర్ వివరాలు ఇవ్వాలి. వాటి ఆధారంగా వారికి ఎంత రుణం లభిస్తుందో వెంటనే స్క్రీన్ పై వస్తుంది. రుణం మొత్తం కొనుగోలుదారుల షాపింగ్ పద్ధతి, చెల్లింపు హిస్టరీపై ఆధారపడి ఉంటుంది. పండుగ సీజన్ లో ఈకామర్స్ దిగ్గజ సంస్థలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కస్టమర్లను ఆకట్టుకొనేందుకు అనేక బంపర్ ఆఫర్లు ఇస్తున్నాయి. అక్టోబర్ 10 నుంచి అమెజాన్ తన అతిపెద్ద యాన్యువల్ ఫెస్టివ్ సీజన్ సేల్ ప్రారంభించనుంది. ఇదే సమయంలో ఫ్లిప్ కార్ట్ కూడా ‘బిగ్ బిలియన్ డే’ సేల్ జరుపనుంది. ఈ సందర్భంగా రెండు కంపెనీలు ఆకర్షణీయ డిస్కౌంట్ ఆఫర్లకు అమ్మకాలు జరుపనున్నాయి. డెబిట్ కార్డ్ పై ఈఎంఐ, నో కాస్ట్ ఈఎంఐ, పేబ్యాక్ గ్యారంటీ వంటి ఎన్నో ఆఫర్లను అందిస్తున్నాయి ఈ రెండు ఈకామర్స్ సంస్థలు