రెండు సభలు-ఒక సందేశం.

హైదరాబాద్;
ఆదివారం తెలంగాణలో రెండు సభలు వేర్వేరు చోట్ల జరిగినా అవి ఒకే సందేశాన్ని ప్రజలకు పంపాయి. ‘దళిత గిరిజన సింహగర్జన’ పేరుతో వరంగల్ లో మంద కృష్ణమాదిగ జరిపిన సభ అధికారపక్షాన్ని వణికించింది. ఈ సభకు దళితులు,గిరిజనులు,ఆదివాసీలు పెద్ద ఎత్తున తరలిరావడం టిఆర్ఎస్ కు ఇబ్బంది కలిగించే అంశం. సిపిఐ,సిపిఐఎం.ఎల్.న్యూడెమొక్రసీ,కాంగ్రెస్, తెలంగాణ జనసమితి, తెలుగుదేశంతదితర రాజకీయ సంస్థలు ఇందులో పాల్గొన్నాయి.ఎస్.ఎన్.టి రిజర్వేషన్ ను పునరుద్ధరించాలనే డిమాండ్ తో సికిందరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన ‘గొల్లకురమ’ల సభ కు సైతం మంచి స్పందన వచ్చింది. గొల్లకురమనవనిర్మాణసమితి ఆధ్వర్యంలో ఈ సభ జరిగింది.ఈ రెండు సభలలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై ‘తిరుగుబాటు’ స్వరం వినిపించింది.1970 వరకు అమల్లో ఉన్న ఎస్.ఎన్.టి రిజర్వేషన్ ను పునరుద్ధరించాలని గొల్లకురమనవనిర్మాణ సమితి కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నది. “ చదువుకుంటున్న గొల్ల కురుమల పిల్లలను బడి మాన్పించిగుర్లను కాయడానికి తిరిగి అడవుల్లోకి పంపించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రయత్నిస్తున్నార’’ని ప్రొఫెసర్ కంచే ఐలయ్యఆరోపించారు.ప్రభుత్వం అందజేస్తున్న గొర్రెలను అమ్మి ఆ డబ్బుతో తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళకు పంపించాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. మరోవైపుతెలంగాణలోబిసిలుఏకమవుతున్నట్టు కొన్నిసంకేతాలుకనిపిస్తున్నవి. ఈ సంకేతాలు టిఆర్ఎస్ కుభయాందోళనలకు గురి చేస్తున్నవి. రాష్ట్రవ్యాప్తంగాబిసి సామాజిక వర్గం 54 శాతం ఉన్నట్టు సమగ్ర సర్వేలో తేలింది.బిసిలలో సామాజిక చైతన్యంఎక్కువ.అయితే వారిలో అనైక్యతే ఇతర అగ్రకులాలు రాజ్యాధికారం చేబట్టడానికికారణమవుతున్నది. గడచిన 70 సంవత్సరాలలో రాజకీయపార్టీలు బిసిలకు ముఖ్యమంత్రి పదవినివ్వలేదని ఆ వర్గాలు రగిలిపోతున్నవి.బిసిలను కేవలం ఓటుబ్యాంకులుగానే ఆయా రాజకీయ పార్టీలు భావిస్తున్నవి.బిసిలను ఆకర్షించడంలో భాగంగానే డాక్టర్ లక్ష్మణ్ కు తెలంగాణసారధ్యాన్ని బిజెపి అగ్రనాయకత్వం అప్పగించింది. కానీ బిజెపి ఆశించిన స్థాయిలో అ పార్టీ వైపు బిసిలుసంఘటితమవుతున్న పరిస్థితులు కానరావడం లేదు. రాష్ట్రంలోమేధావులు,విద్యావంతులు,యువత,విద్యార్థులు చాలా కాలంగా బిసిలరాజ్యాధికారం కోసం కొత్త పార్టీఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పార్టీలు బిసిలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వడం లేదని సొంతపార్టీమాత్రమెబిసిలకు న్యాయం చేయగలదని  ఆ వర్గాలు భావిస్తున్నవి. ఈ నేపథ్యంలో కొత్త పార్టీ పెట్టాలని తెలుగుదేశం పార్టీశాసనసభ్యుఅడుఆర్.కృష్ణయ్యపై ఒత్తిడి పెరుగుతున్నది. జస్టిస్చంద్రకుమార్,ప్రొఫెసర్కోదండరాం,డాక్టర్ చెరుకు సుధాకర్ ఎవరికివారే సొంత పార్టీలు ఏర్పాటు చేసుకున్నారు. చంద్రకుమార్,సుధాకర్ ల పార్టీల కన్నా కోదండరాం పార్టీ తెలంగాణ జనసమితి ప్రజల్లో వేగంగా వెళ్తున్నది. తెలంగాణఉద్యమంలోకోదండరాం చురుగ్గా పాల్గొనడం,జెఏసి చైర్మన్ గా ఆయన పోషించిన పాత్ర వల్ల ప్రజల్లో,తెలంగాణవాదుల్లో‘ఫాలోయింగ్’ పెరుగుతున్నది. చట్టసభలలోబిసిలకు 54 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ కు క్రమంగా మద్దతు పెరుగుతున్నది. గ్రామపంచాయతీఎనికల్లోబిసిలకు రిజర్వేషన్లు 34 నుంచి  54 శాతానికి పెంచాలని కోరుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఆర్.కృష్ణయ్య లేఖ రాశారు. జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్లు ఇవ్వాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి ఇందుకు సానుకూలంగా స్పందించే అవకాశాలు లేవని బిసి నాయకులంటున్నారు. తెలంగాణలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలను పూర్తిగా నిర్వీర్యం చేయడానికి అధికార తెలంగాణరాష్ట్రసమితి వేయని ఎత్తుగడ లేదు. అమలు చేయని పాచిక లేదు. అయితే కాంగ్రెస్ పార్టీకి  కొన్ని నియోజకవర్గాలలో నాయకత్వలేమి కనిపించినా స్థానికంగా బలమైన నేతలు ఉన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలలో అర్ధబలం,అంగబలం,పలుకుబడి ఉన్న దిగువశ్రేణి నాయకత్వం ఆ పార్టీకి పుష్కలంగా ఉంది.అందులో బిసి నాయకులు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయంగా ఉన్న ఓటు బ్యాంకులను కొల్లగొట్టేందుకు కెసిఆర్ పకడ్బందీ వ్యూహరచనతో ముందుకు వెళ్తున్నారు. అయితేదళితులు,గిరిజనులు,బిసిలుఅధికారపక్షానికి వ్యతిరేకంగా వివిధ సందర్భాలలో ఎందుకు సమీక్రుతమవుతున్నారన్న అంశం కెసిఆర్ ను కలవరపరుస్తున్నది.