రెడ్ల సమరభేరి కి లక్ష మంది.

హైదరాబాద్:
పేద రెడ్లు సామాజికంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం, న్యాయమైన హక్కుల సాధన కోసం ఆదివారం గౌరెల్లి గ్రామంలోని తారామతిపేట్‌లో ‘రెడ్ల సమరభేరి’. సభలో రాజకీయ పార్టీలకతీతంగా వివిధ పార్టీల్లోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నేతలు పాల్గొన్నారు.
ఔటర్‌ రింగ్‌రోడ్డు టోల్‌గేట్‌ ఎగ్జిట్‌ నెంబర్‌ 10వద్ద గల రాజా బహదూర్‌ వెంకటరామారెడ్డి ప్రాంగణం చట్టబద్ధతతో కూడిన ప్రత్యేక నిధులతో రెడ్డి కార్పొరేషన్‌,విద్యా ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు,రెడ్డి విద్యార్ధులకు గురుకులాలు, స్టడీ సర్కిళ్లు,పూర్థిస్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్‌,విదేశీ విద్యానిధి,కటాఫ్ మార్కులు వయోపరిమితి సడలింపు, స్వయం ఉపాధి రంగాల్లో ప్రభుత్వం చేయూత , రైతు సంక్షేమం,ఆరోగ్య పధకాల సమాన వర్తింపు, 60 సంవత్సరాలు నిండిన రైతులకు 5 వేల పింఛను, పొలం బాటలో ప్రమాదవశాత్తు మరణించే రైతులకు 10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని సభ డిమాండ్ చేసింది.