రేపు జగన్ కేబినెట్ ప్రమాణం.

రేపు జగన్ కేబినెట్ ప్రమాణం.

amaravathi:

ఆంధ్రప్రదేశ్‌ మంత్రుల ప్రమాణస్వీకారం శనివారం జరగనుంది. ఐదుగురు డిప్యూటీ సీఎంలతో పాటు 20 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్ తొలిసారి శనివారమే సచివాలయంలో అడుగుపెట్టనున్నరు. ఆయన సచివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత కొన్ని కీలకమైన ఫైల్స్‌పై సంతకాలు చేస్తారు. సచివాలయంలో తొలి కేబినెట్ సమావేశం జరగనుంది. శనివారం ఉదయం 8.39 గంటలకు సచివాలయంలోని తన ఛాంబర్‌లో జగన్ అడుగుపెట్టనున్నారు. 9.15 గంటలకు సచివాలయం గ్రౌండ్‌కు చేరుకుని ఉదయం 11.30 గంటల వరకు అక్కడే ఉంటారు. మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం ఉదయం 9.50 గంటలకు మొదలుకానుంది. ఉదయం 11.49 గంటలకు వైఎస్ జగన్ తొలి కేబినెట్ సమావేశం కానుంది.