రేపు టిఆర్ఎస్ లో చేరనున్న కాంగ్రెస్ ఎం.ఎల్.సి

హైదరబాద్;
కాంగ్రెస్ పార్టీ కి చెందిన శాసనమండలి సభ్యుడు దామోదరరెడ్డి శనివారం సాయంత్రం టిఆర్ ఎస్ లో చేరనున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో ఆయన పార్టీ మారనున్నారు. నాగం జనార్ధన రెడ్డి కాంగ్రెస్ లో చేరినపటినుంచి నాగర్  కర్నూల్ కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దామోదరరెడ్డి తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. చివరకు పార్టీ మారడానికే ఆయన నిర్ణయించుకున్నారు. దీంతో నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లు భావిస్తున్నారు.