రేపు ఢిల్లీలో అటవీ శాఖ మంత్రుల సదస్సు. హాజరు కానున్న మంత్రి జోగు రామన్న.

హైదరాబాద్;
దేశంలోని అన్ని రాష్ట్రాల అటవీ శాఖ మంత్రుల సదస్సు సోమవారం ఢిల్లీలో జరుగనుంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఉదయం10.00 గంటలకు ప్రారంభమయ్యే ఈ సదస్సులో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న పాల్గొననున్నారు.కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.వ్యర్థ పదార్థాల వినియోగం, వాటి వల్ల ఏర్పడే దుష్పరిణామాలు అనే అంశాలపై జరిగే చర్చా గోష్టి సమావేశానికి మంత్రి జోగు రామన్న అధ్యక్షత వహించనున్నారు
ఈ సదస్సులో పాల్గొనేందుకు మంత్రి జోగు రామన్న ఆదివారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు