రేపే అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’.

న్యూఢిల్లీ:

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ మరోసారి క్రేజీ ఆఫర్ల వర్షం కురిపించేందుకు సిద్ధమైంది. దసరా పండుగ సందర్భంగా అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’కి తెర తీస్తోంది. ఈ నెల 10 రాత్రి 12 గంటల నుంచి 15 రాత్రి 11.59 నిమిషాల వరకు ఈ మెగా సేల్ జరగనుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు మాత్రం రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచే అమ్మకాలు ప్రారంభం అవుతాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ సేల్‌లో 4 లక్షల మంది అమ్మకందారులు తమ ఉత్పత్తులను అమ్మకానికి పెట్టనున్నారని అమెజాన్ తెలిపింది. ప్రైమ్‌ మెంబర్లకు అధిక ప్రాధాన్యత ఇస్తూ… వీరికి ప్రత్యేకంగా 9న మధ్యాహ్నం 12 గంటలకు సేల్‌ ప్రారంభం కానుంది. ప్రైమ్‌ సభ్యులు కానివారికి 10 అర్థరాత్రి 12 నుంచి సేల్‌ ఆరంభమవుతుంది. అదే రోజు డెలివరీ, అమెజాన్‌ పే, ఈఎంఐ ద్వారా జీరో– కాస్ట్‌ సౌకర్యం, క్యాష్‌ ఆన్‌ డెలివరీ, ఉదయం డెలివరీ వంటి అనేక సౌకర్యాలు కల్పిస్తున్నట్టు అమెజాన్‌ తెలిపింది. స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తులు.. వస్తువు ఏదైనా ఆరంభం నుంచే భారీ తగ్గింపు ఇస్తున్నట్టు అమెజాన్ తెలిపింది. ఈ సేల్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది స్మార్ట్ ఫోన్లలో ప్రస్తుతం హాట్ కేక్ మాదిరిగా అమ్ముడవుతున్న వన్ ప్లస్ 6ని (ఎమ్మార్పీ ధర రూ.34,999) రూ.29,999కే అందించనుంది. అంతే కాకుండా ఈ సేల్ లో అమ్ముడయ్యే అన్ని స్మార్ట్ ఫోన్లపై ఒకసారి ఉచితంగా స్క్రీన్ రీప్లేస్ మెంట్ సౌకర్యం ఉండబోతోంది. కొన్ని ఎంపిక చేసిన స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నారు. ఆనర్ ప్లే (ఎమ్మార్పీ రూ.21,999) రూ.18,999, ఆనర్ 7ఎక్స్ (ఎమ్మార్పీ రూ.13,999) రూ.9,999, హువావీ పీ20 లైట్ (ఎమ్మార్పీ 22,999) రూ.15,999కే లభించనున్నాయి. శాంసంగ్ గెలక్సీ ఎస్9 (ఎమ్మార్పీ రూ.62,500) 42,990కే దొరుకుతుంది. అంతే కాకుండా మామూలు ఎక్స్చేంజీ విలువ కంటే అదనంగా రూ.3,000 డిస్కౌంట్ గా ఇస్తున్నారు. హువావీ పీ20 ప్రో రూ.60,000 కంటే తక్కువకే లభించనుంది. పెద్ద స్క్రీన్ ఎల్ఈడీ టీవీలు, బ్లూటూత్ స్పీకర్లు, మొబైల్ ఉపకరణాలు, అమెజాన్ ఫైర్ టీవీ, కిండిల్ ఈ-రీడర్లు, వంటివెన్నో సరసమైన ధరలకు అమ్మబోతున్నారు. ప్రతి 2 గంటలకు రెడ్ మి 6ఏ ఫ్లాష్ సేల్ జరగనుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో వస్తువులు కొనుగోలు చేయడానికి రూ.60,000 వరకు రుణం ఇస్తారు. అంతే కాకుండా గుర్తింపు పొందిన క్రెడిట్ కార్డులపై నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా అందజేస్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్, క్రెడిట్ కార్డులపై కొనుగోలు చేస్తే అదనంగా 10% డిస్కౌంట్ లభించనుంది. అమెజాన్ పే ద్వారా చెల్లిస్తే క్యాష్ బ్యాక్ కూడా అందజేస్తున్నారు.