రేవంత్‌రెడ్డి నివాసంలో రెండో రోజు ఐటీ సోదాలు.

హైదరాబాద్:

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి నివాసంలో రెండో రోజు ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు శుక్రవారం కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇళ్లు, కంపెనీలు సహా మొత్తం 15 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే రేవంత్ బంధువులు, స్నేహితుల ఇళ్లల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా లాకర్లలో కీలక పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇప్పటికే రేవంత్‌రెడ్డిపై బ్లాక్‌మనీ, ఐటీ, మనీ లాండరింగ్‌, ఫెమా, బినామీ లావాదేవీల చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉండగా రేవంత్‌రెడ్డి వియ్యంకుడిపై ఐటీ ఉచ్చు బిగుస్తోంది.