రేవంత్ కోసం ఆందోళన. అరెస్ట్.

హైదరాబాద్:

రేవంత్ రెడ్డి ని తమకు చూపించాలంటూ తీవ్ర స్థాయిలో ఆందోళన చేపట్టిన అభిమానులు, కార్యకర్తలు. దీంతో చేసేది లేక రేవంత్ రెడ్డిని ప్రజలకు కనబడేందుకు అనుమతించిన పోలీసులు. ఇంట్లో నుండి బయటకు వచ్చి ఇంటి బయటఉన్న కాంపౌండ్ లొనే కుర్చీ పైకి ఎక్కి అందరికి చెయ్యిఊపుతూ అభివాదం చేసిన రేవంత్ రెడ్డి. తిరిగి ఇంట్లోకి వెళ్లిన రేవంత్ రెడ్డి.
రేవంత్ ఇంటి దగ్గర ఆందోళనకు దిగిన కాంగ్రెస్ నాయకులు సీతక్క, అరికెల నర్సారెడ్డి, రాజారామ్ యాదవ్, వేం నరేంద్ర రెడ్డి తదితర కార్యకర్తలను అరెస్ట్ చేశారు.