రేవంత్ ను పరామర్శించిన ‘కూటమి’ నాయకులు.

హైదరాబాద్:
ఐ.టి.సోదాల నేపథ్యంలో ‘కూటమి’ నాయకుల బృందం ఆదివారం రాత్రి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ ను పరామర్శించారు. ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే కుట్ర జరుగుతున్నట్లు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఆరోపించారు.కేంద్ర ,రాష్ట్ర నిఘా సంస్థల పై నమ్మకం పోయిందన్నారు.ముగిసిన కేసుల ను తిరగదోడుతున్నారని విమర్శించారు.
ప్రజల్లో ఆదరణ ఉన్న ప్రతిపక్ష నాయకులను దెబ్బతేసే కుట్రగా ఆయన ఆరోపించారు.
రేవంత్ రెడ్డి కుటుంభం మోదటి నుంచి ఆర్దీకంగా ఉన్న కుటుంబం అని చెప్పారుకేంద్రం, రాష్ట్ర సంస్థ లను ఉపయోగించి బెదిరిస్తున్నారని చెప్పారు.హైకోర్టు, ఏన్నికల కమీషన్ ఏన్ని సార్లు మొట్టికాయలు వేసినా కేసీఆర్ లో మార్పు రావట్లేదన్నారు.ప్రజా క్షేత్రం లో ప్రజలే కేసీఆర్, మోడీ ని శిక్షిస్తారని తెలిపారు.ఈడీ, ఐటీ దాడులతో భయబ్రాంతులకు గురిచేస్తున్నారని సీపీఐ తెలంగాణ సెక్రటరీ చాడ వెంకటరెడ్డి ఆరోపించారు.వంద సీట్లు గెలుస్తామనే భ్రమలో కేసీఆర్ ఈ విధంగా వ్వవహరిస్తున్నాడన్నారు.
రేవంత్ ఇంటి పై ఐటీ దాడులు చేసి గ్లోబెల్స్ ప్రచారం చేసారన్నారు. ఐటీ దాడులకు బయపడేది లేదన్నారు.కుటుంబ పాలన వద్దు – ప్రజా పాలన ముద్దు అనే నినాదం తో ముందుకు వెల్తున్నామని చాడ తెలిపారు.రేవంత్ కు కేసీఆర్ ను ఏధుర్కునే ధైర్యం ఉందన్నారు.