రేవంత్ పై న్యాయవాది ‘నేర పరిశోధన’.

హైదరాబాద్:
ఐటి ఈ.డి అధికారులు రేవంత్ రెడ్డి ఇంటిపై దాడులు చేయలేదని, సోదాలు జరిగాయని న్యాయవాది ఇమ్మనేని రామారావు అన్నారు. 3వందల కోట్ల అక్రమ లావాదేవీలు జరిపారని తాను సిబిఐ కి పిర్యాదు చేసానని, సిబిఐ ఐటి కి కేసు బదిలీ చేశారని చెప్పారు.రేవంత్
19 కంపెనీలు పెట్టి అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.సాయి మౌర్య కంపెనీలో రేవంత్ రెడ్డి బావమరిది జయప్రకాష్ ముఖ్య పాత్ర పోషించారని రామారావు చెబుతున్నారు.
రేవంత్ పెట్టిన కంపనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపనీ లో షేర్లు ఎలా ఇస్తున్నారని తాను విచారణ చేసానన్నారు. సాయి మౌర్య కంపనీ ద్వారా భూ ఆక్రమణలకు రేవంత్ పాల్పడ్డారని రామారావు అన్నారు.అవలంచర్ ఇన్ ఫ్రాక్ట్ర చర్ కంపనీ సురేష్ అనే పేరుతో ఉందన్నారు.నోటీసులు వస్తే దానికి సమాధానం ఇవ్వకుండా రేవంత్ రాజకీయాన్ని తెరమీదకు తెస్తున్నారని న్యాయవాది ఆరోపించారు. ఐటి,ఈడి అధికారులు చాలా బాగా పనిచేస్తున్నాయని ఆయన కితాబు నిచ్చారు.ఉప్పల్ లో చేసిన భూ దందా, కబ్జా సైతం బయటకు వచ్చిందన్నారు.జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నేను పిర్యాదు చేసిన తరువాత నోటీసులు ఇచ్చారని తెలిపారు.ఐటి అధికారులు ఇప్పటికే రేవంత్ రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇచ్చారని, రేవంత్ వాటికి రిప్లై ఇవ్వలేదని అన్నారు. అతని పై పిర్యాదు చెయ్యడంలో ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదన్నారు.కొంతమంది భూ కబ్జా దారుల వల్ల మహిళను రక్షించే క్రమంలో తనపై పై అక్రమ కేసులు పెట్టారని వివరణ ఇచ్చారు.మీడియా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా రామారావు దాటవేశారు.