రేవంత్ రెడ్డి పై కేసులు, వివరాలు:

హైదరాబాద్:

రేవంత్ అక్రమాస్తులపై న్యాయవాది రామారావు ఈడీకి ఫిర్యాదు చేయడంతో పలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఏకకాలంలో జూబ్లీహిల్స్, కొడంగల్‌తో పాటు 15 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేశారు.దేశ, విదేశాల్లో అక్రమ లావాదేవీలు రేవంత్‌రెడ్డి జరిపినట్లు ఆధారాలు బయటపడుతున్నాయి. అమెరికా, మలేషియా, సింగపూర్, దుబాయ్, హాంకాంగ్ దేశాల్లో హవాలా మార్గంలో వందల కోట్లను రేవంత్‌రెడ్డి తరలించాడు. ఫెమా, మనీలాండరింగ్ చట్టాలను ఉల్లంఘించి అక్రమంగా విదేశీ బ్యాంకు ఖాతాల్లో రేవంత్ డబ్బులు జమ చేశారు.2014, ఫిబ్రవరి 25న సింగపూర్‌లోని ఒక స్థిరాస్తిని 20 లక్షల సింగపూర్ డాలర్లకు రేవంత్‌రెడ్డి విక్రయించినట్లు ఫిర్యాదులో రామారావు పేర్కొన్నారు. అదే రోజున రేవంత్‌రెడ్డి హాంకాంగ్ బ్యాంకు ఖాతా నెం. 1260779653146కు 60 లక్షల మలేషియన్ రింగెట్స్‌ని బదిలీ చేసిన రఘువరన్ మురళి(ఆర్‌హెచ్‌బీ బ్యాంకు ఖాతా నెం. 100482930330069). 2014 ఫిబ్రవరి 25న రేవంత్‌రెడ్డికి సంబంధించిన కౌలాలంపూర్ ఆర్‌హెచ్‌బీ బ్యాంకు ఖాతా నెం. 1300098050844099కు రఘువరన్ మురళి ఖాతా నుంచి 20 లక్షల సింగపూర్ డాలర్లు(రూ. 9 కోట్ల 53 లక్షలు) బదిలీ చేశారు. 2014, ఫిబ్రవరి 25న ఒక్కరోజే రేవంత్‌రెడ్డి బ్యాంకు అకౌంట్లలో రూ. 20 కోట్ల విదేశీ మారక ద్రవ్య లావాదేవీలు జరిగినట్లు ఫిర్యాదులో న్యాయవాది పేర్కొన్నారు.దుబాయ్‌లో హవాలా ద్వారా రేవంత్‌రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి ఎన్నో అక్రమ వ్యాపార కార్యకలాపాలకు పాల్పడ్డారు. అమెరికాలో ఉన్న మరో తమ్ముడు జగన్ రెడ్డి ద్వారా కూడా ఎన్నో అక్రమ కార్యకలాపాలు నిర్వహించారు. గత 20 సంవత్సరాలుగా రేవంత్‌రెడ్డికి బినామీగా వియ్యంకుడు వెంకట్‌రెడ్డి వ్యవహరిస్తున్నాడు. నెక్సస్ ఫీడ్స్ లిమిటెడ్ పేరుతో షెల్ కంపెనీ నిర్వహిస్తూ రూ. 65 కోట్ల ప్రజాధనాన్ని రేవంత్‌రెడ్డి కొల్లగొట్టాడు. రూ. 14 కోట్లతో చైనా తైవాన్ నుంచి గోల్డెన్ ఫీడ్స్ పేరుతో మిషనరీని కొనుగోలు చేసిన వెంకట్‌రెడ్డి.. అదే మిషనరీని మరో బినామీ సయ్యద్ ఉబేద్‌కు చెందిన పయనీర్ ఎక్వీప్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌కి రూ. 25 కోట్లకు అమ్మాడు. మళ్లీ అదే మిషనరీని రూ. 80 కోట్ల(ఇందులో రూ. 75 కోట్ల బ్యాంక్ లోన్)కు నెక్సస్ ఫీడ్ కొనుగోలు చేసింది. చేతులు మార్చడం ద్వారా ఒకే మిషనరీ ధరను రూ. 25 కోట్ల నుంచి రూ. 80 కోట్లకు రేవంత్‌రెడ్డి అండ్ కంపెనీ పెంచినట్లు ఫిర్యాదులో రామారావు వెల్లడించారు.
————————————–
రేవంత్ పై కేసులు.

#బ్లాక్ మనీ, ఇన్ కం ట్యాక్స్ చట్టం 2015.
#ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ చట్టం 2002.
#ప్రొహిబిషన్ ఆఫ్ బినామీ ట్రాన్సాల్షన్ ఆక్ట్ 1988.
#ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988.

#రేవంత్ పై ఉన్న అభియోగాలు:

2014 ఫిబ్రవరి 25 న సింగపూర్ లోని బహుళ అంతస్థుల అమ్మకంలో 20 లక్షల సింగపూర్ డాలర్లు. 25/02/2014రోజున మురళీ రాఘువరన్ దగ్గరి నుంచి 60 లక్షలు పొందాడు.పై రెండు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు, ఎన్నికల అఫిడవిట్ లో కానీ ఐటీ రిటర్న్స్ లో వాటి సమాచారం ఇవ్వలేదు. లెక్కలేనంత డబ్బు పెట్టి వివిధ ఖాతాల ద్వారా సింగపూర్ మలేసియాలలో ఆస్తులు కూడబెట్టారు.ఆంటి కరప్షన్ ఆక్ట్ సెక్షన్ 1988 ఉల్లగించారని అభియోగం.తన అనుచరులు బినామీలు బంధువుల పేర్లతో షెల్ కంపెనీలు సృష్టించి, కేవలం రేవంత్ రెడ్డి లబ్ధి పొందినట్లు ఆరోపణ.తన కుటుంబ సభ్యల పేరు మీద వ్యవసాయ భూములు, కమర్షియల్ ప్లాట్లు, బిల్డింగ్ లు తదితర ఆస్థులు రేవంత్ రెడ్డి బినామీల మీద ఉన్నట్లు గుర్తింపు.కొన్ని భూముల కొనుగోలు లావాదేవీల వ్యవహారం ఐటీ రిటర్న్స్ లో కానీ, ఎన్నికల అఫిడవిట్ లో పొందుపరచని రేవంత్ ఉదాహరణ కి ఉప్పల్ ల్యాండ్ కొనుగోలు.
అతని హోదా ఉపయోగించి అతను, అతని బంధువుల పేరుతో అక్రమ పద్ధతి లో భారీ గా ఆస్థులు కూడబెట్టినట్లు ఆరోపణ.2009 నుంచి 2014 వరకు, 2014 నుంచి ఇప్పటి వరకు అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి సంపాదించిన పలు ఆస్తులు ఆదాయానికి మించినవి గుర్తించారు.

– కొడంగల్ నియోజక వర్గంలో ఎమ్మెల్సీ, ఎమ్మేల్యేగా ఎన్నికైన దశ నుంచే అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు.

– 2009, 2014 ఎన్నికల అఫిడవిట్ లో పొందుపర్చిన ఆస్తల వివరాల ప్రకారం ఐటీ రిటర్న్స్ చెల్లింపులు సరిగా లేనట్లు గుర్తింపు.

– రాజకీయ అండ ఉపయోగించి వ్యక్తిగత లబ్ధి పొందటమే కాకుండా భారీగా ఆస్తులు సెకరించినట్లు ఆరోపణ.

– 2014 లో రేవంత్ వద్ద ఉన్న నల్లధనంతో మలేషియాలోని ఆస్తులను కొనుగోలు చేసి వివిధ బ్యాంకు అకౌంట్ల ద్వారా తిరిగి వైట్ మనీ పొందినట్లు ఆరోపణ.

– 25/02/2014 న రేవంత్ రెడ్డి హాంగ్ కాంగ్ బ్యాంక్ అకౌంట్ లో 60 లక్షల *మలేషియన్ రింగెట్స్* ని జమ చేసినట్లు ఆరోపణ.

– ఆ సొమ్మును కౌలాంలంపూర్ వాసి రఘువరన్ మురళి RHB బ్యాంక్ ద్వారా రేవంతుకు డబ్బు అందినట్లు ఆరోపణ

– విదేశాల నుంచి వచ్చిన సొమ్ము ఇండియన్ కరెన్సీలో 10కోట్లకు పైగా విలువ చేస్తున్నట్లు అభియోగం.

– విదేశాల లావాదేవీల వ్యవహారంలో కౌలాంలంపూర్ రఘువరన్ మురళికి రేవంత్ కి మధ్య చాలా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఆరోపణ.

– ఈ విదేశీ లావాదేవీలన్నీ 2014 ఎన్నికల ముందే జరిగాయి, వాటిని ఎన్నికల అఫిడవిట్ లో పొందుపర్చనట్లు గుర్తింపు.

– రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి ద్వారా హావాల రూపంలో దుబాయ్ నుంచి సొమ్ము పొందినట్లు గుర్తింపు.

– వియ్యంకుడు వెంకట్ రెడ్డి( రేవంత్ కూతురు నైమిసా రెడ్డి మామయ్య) పేరుతో నెక్సెస్ ఫీడ్ సంస్థ ను స్థాపించి ఆంధ్రప్రదేశ్ లో భారీ మొత్తంలో లావాదేవీలు జరిపినట్లు గుర్తింపు.

– నెక్సెస్ ఫీడ్ కంపెనీ నుంచి రేవంత్ రెడ్డి ఖరీదైన ఫోర్సే కారు నం. AP37CQ0999 పొందినట్లు గుర్తింపు.

– ఫెమా రెగ్యూలేషన్ ఆక్ట్, బినామీ లావాదేవీలు,లోన్స్ డైవర్టెడ్, మనీ ల్యాండరింగ్ ఆక్టివిటీస్ ఉల్లఘించినట్లు గుర్తింపు.