రైతులు సంఘటితశక్తిగా మారాలి.

-ముఖ్యమంత్రి కెసిఆర్

హైదరాబాద్.
రైతుల్లో ఐక్యత రావాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆకాంక్షించారు.తెలంగాణ లో నేను రైతును అని గర్వాంగా చెప్పుకునే పరిస్థితి రావాలని ఆయన సోమవారం జరిగిన సదస్సులో అన్నారు.డిమాండ్ ఉన్న పంటలు పండిస్తే ఎక్కువ ధర వస్తుందని,రైతులు సంఘటిత శక్తిగా మారాలని సి.ఎం అభిలషించారు.నియంత్రిత రూపంలో పంటలు పండించి, మార్కెట్ కు తీసుకెళ్ళాలని కోరారు.రైతు సహజ మరణం పొందినా బీమా వర్తిస్తుందన్నారు.డెత్ సర్టిఫికెట్ ఇస్తే సరిపోతుందని ,డెత్ సర్టిఫికెట్ ఇచ్చే అధికారం గ్రామపంచాయతిలకు ఇస్తామని తెలిపారు.టిఆర్ఎస్ ను ఎలా ఎదుర్కోవాలో ప్రతిపక్షాలకు తెలియటం లేదని కెసిఆర్ అన్నారు.


‘దేశంలో ఎక్కడా ఇలాంటి స్కీం లేదు. పదిరోజుల్లో బీమా ఇస్తామన్నందుకు ధన్యవాదాలు.ప్రపంచంలోనే అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసి.నా జీవితంలో నేను చేసిన అతి గొప్ప పనిగా భావిస్తున్న. 57 లక్షల మంది రైతులున్నారు.89 శాతం రైతులు రైతుబందు స్కీం తో సంతృప్తిగా ఉన్నారు.ఇతర రాష్ట్రాల్లో మన పథకాలపై ఒత్తిడి పెరిగిపోతుంది.24 గంటలు కరంటు వస్తుంది. 2019 జూన్ నాటికి కాళేశ్వరం నీళ్లు వస్తాయి.365 రోజులు చెరువుల్లో నీరు ఉంటుంది.12 వేల కోట్లు రైతులకే ఉంటాయి.18లక్షల మంది ఒక్క ఎకరం ఉన్న రైతులు ఉన్నారు. రూ.4956 కోట్లు చిన్న సన్న కారు రైతులకు పోతవి.పెట్టుబడి, బీమా, సాగునీరు, 24గం. కరంటుతో పాటు మద్దతు ధర కూడా అందాలి.రైతు బీమా ఏఈఓ లు కీలక బాధ్యత.నామిని పత్రాలు నింపి పంపాలి. 15 ఆగస్టు తర్వాత రైతు చనిపోతే…ఆ రైతుకు బీమా వస్తుంది.మద్దతు ధర నిర్ణయించే అధికారం మన చేతిలో లేదు.క్రాప్ కాలనీలు ఏర్పాటు చేసి.. పంటల సాగుపై సూచనలు చేస్తారు.వరినాటు యంత్రాలు సబ్సిడీపై అందజేస్తాం.రైతు వేదికలు త్వరగా పూర్తి చేయాలి.2,500 క్లస్టర్లలో యంత్రాలు ఎన్ని ఉన్నాయో లెక్క చూడాలి.రైతుల్లో ఐక్యత రావాలి.తెలంగాణ లో నేను రైతును అని గర్వాంగా చెప్పుకునే పరిస్థితి రావాలి. డిమాండ్ ఉన్న పంటలు పండిస్తే ఎక్కువ ధర వస్తుంది.రైతులు సంఘటిత శక్తిగా మారాలి.నియంత్రిత రూపంలో పంటలు పండించి, మార్కెట్ కు తీసుకెళ్ళాలి. రైతు సహజ మరణం పొందినా బీమా వర్తిస్తుంది.డెత్ సర్టిఫికెట్ ఇస్తే సరిపోతుంది.డెత్ సర్టిఫికెట్ ఇచ్చే అధికారం గ్రామపంచాయతిలకు ఇస్తాం. టిఆర్ఎస్ ను ఎలా ఎదుర్కోవాలి తెలియటం లేదు.కౌలు రైతులకు పెట్టుబడి డబ్బు ఇవ్వటం కుదరదు.పాస్ బుక్ లో అనుభవదారి లేకుండా చేశాం.రైతు భూమి మీద ఇతరులకు హక్కులు కల్పించటం ఇష్టం లేదు.క్లస్టర్లలో యాంత్రీకరణ వివరాలు వెంటనే సేకరించాలి. కమతాల ఏకీకరణ చేయటం ద్వారా రైతులకు మేలు జరుగుతుంది.సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలి’.