రైతు ఆత్మగౌరవంతో జీవించడమే కేసీఆర్ లక్ష్యం.- పోచారం.

హైదరాబాద్.

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU), రాజేంద్రనగర్, ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన “విత్తన మేళా-2018” ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పొచారం శ్రీనివాస రెడ్డి గురువారం ప్రారంభించారు. విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రవీణ్ రావు, రైతులు పాల్గొన్నారు.
ఈసందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్ళను మంత్రి పొచారం పరిశీలించారు.
ఆరోగ్యకరమైన విత్తనం నాటితే పంట దిగుబడి బాగుంటుందని పోచారం అన్నారు.ప్రధానమంత్రి రైతుల ఆధాయం రెట్టింపు చేయిలంటున్నాడు, కాని ఎలా అన్నది ఎవరు చెప్పడం లేదన్నారు.
తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడగానే వ్యవసాయ దండగ కాదు పండుగ చేయాలని ముఖ్యమంత్రి
దృడ సంకల్పంతో ఉన్నారని మంత్రి తెలిపారు.
దేశానికి అన్నం పెట్టె రైతన్న ఆత్మాభిమానంతో బతకాలన్నదే ముఖ్యమంత్రి ఆశయం అని వ్యవసాయ మంత్రి చెప్పారు.ప్రపంచంలో మొదటిసారి ఎకరాకు రూ. 8000 ఇస్తున్న ఎకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.
ప్రవేటు వ్యాపారుల దగ్గర అప్పు చేయకుండా ప్రభుత్వమే పెట్టుబడి ఇస్తుందని తెలిపారు.
విత్తనం ఎంపికే పంట దిగుబడి మూలం అని ఆయన అభిప్రాయపడ్డారు.
శాస్త్రవేత్తల మేధాశక్తికి రైతుల శ్రమ తోడయితే ఆద్భుత ఫలితాలు వస్తాయన్నారు.
ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రభుత్వం రాయితీలతో పాటు మౌళిక సదుపాయాలు కల్పిస్తుందన్నారు.
మూల విత్తనంపై 50 శాతం సభ్సిడీని అందజేస్తామని చెప్పారు.గతంలో విత్తనాలు, ఎరువుల కోసం క్యూలైన్లు, తొక్కీసలాట, లాఠీచార్జీలు జరిగేవని గుర్తు చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపు వల్ల విత్తనాలు, ఎరువుల కొరత లేదన్నారు.రాష్ట్రంలో ఈ వానాకాలం కొరకు 7.5 లక్షల క్వింటాల్ల విత్తనాలు, 8 లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు.
రసాయన ఎరువులు అధికంగా వాడితే భూమి దెబ్బతింటుందన్నారు.
భూమిని అమ్మినవారు చెడిపోయారు, కాని భూమిని నమ్ముకున్నవారు ఎప్పుడు చెడిపోలేదని పోచారం చెప్పారు.
రాష్ట్రంలో ఈ యాసంగిలో 3,600 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 30 లక్షల టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు.మక్కలు బీహార్, ఉత్తరాధి రాష్ట్రాలలో రూ. 1100 కే కొనుగోలు, కాని మన రాష్ట్రంలో రైతులకు మద్దతు ధర అందించాలని రూ.1420 కొనుగోలు చేస్తున్నామని చెప్పారు.
రైతులకు లాభం అందించాలనే ఉద్యేశంతో ప్రభుత్వానికి నష్టం అయినా రైతుల నుండి మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని చెప్పారు.
“పంటల భీమాకు గ్రామాన్ని యూనిట్ గా తీసుకోవాలని రాష్ట్రం తీర్మానం చేసి కేంధ్రానికి పంపింది.
రైతు భీమా సౌకర్యంపై విదివిధానాలను రూపొందించి త్వరలోనే ప్రారంభిస్తాం.
దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే వారం రోజులలోనే కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా అందాలి. రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇన్సురెన్స్ కంపెనీలతో సమావేశమై విదివిధానాలను రూపొందిస్తారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవసాయ రంగం కోసం చేస్తున్న మంచిపనులు దేశానికే ఆదర్శం” అని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు.