రైతు కష్టం తెలిసిన కెసిఆర్ సీ. ఎం. గా ఉండడం అదృష్టం.

రాజన్న సిరిసిల్ల.
సిరిసిల్ల మండలం సర్ధాపూర్ గ్రామంలో వ్యవసాయ కళాశాలకు వ్యవసాయ శాఖ మంత్రి పొచారం శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర పురపాలక, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ వ్యవసాయ కళాశాల కు శంకుస్థాపన చేశారు. గత ఏడాది అగ్రీ పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభోత్సవం కోసం వచ్చినప్పుడు సిరిసిల్లకు వ్యవసాయ కళాశాల కావాలని కెట్ఆర్ కొరారని పోచారం చెప్పారు.

కేటీఆర్ కోరిక మేరకు సిరిసిల్లకు నూతన వ్యవసాయ కళాశాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలతో ఈ ప్రాంతంలో వ్యవసాయం అభివృద్ది చెందుతుందని, కాబట్టి వ్యవసాయ కళాశాల ఎంతో అవసరమన్నారు.

ఈ కళాశాలతో ఈ ప్రాంత రైతులకు మేలు జరుగుతుందని మంత్రి తెలిపారు. రూ. 30 కోట్లతో 70 ఎకరాలలో ఈ వ్యవసాయ కళాశాల నిర్మాణం జరుగుతున్నదని చెప్పారు.మంత్రి కెటిఆర్ కోరిక మేరకు ఈ ఏడాది నుండే కళాశాలలో తరగతులను ప్రారంభిస్తామని తెలియజేశారు. తెలంగాణ ఏర్పడిన నాలుగేళ్ళలోనే అద్భుతమైన ప్రగతి సాదించామన్నారు. పక్క రాష్ట్రాలలో కరంటు కొరత ఉంది. కాని దేశంలో వ్యవసాయ రంగానికి 24 గంటల కరంటు సరఫరా చేస్తున ఎకైక రాష్ట్రం తెలంగాణ, ఎకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు.ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు ఎకరాలకు సాగునీరందించడానికి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుందని తెలిపారు.
రైతుల కష్టాలు తెలిసిన కెసిఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటం రైతుల అదృష్టం అని పోచారం చెప్పారు.విత్తనం వేసిన దగ్గర నుండి పంట ఉత్పత్తులను సరియైన ధరలకు అమ్ముకునే వరకు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. భూరికార్డుల ప్రక్షాళన ద్వారా యాబై ఏడు లక్షల మందికి పైగా రైతులకు ప్రయోజనం కలిగిందన్నారు.రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు రూ. 8000 ను పెట్టుబడిగా అందిస్తున్న ఎకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తెలిపారు.కాంగ్రేస్ నాయకులు పసలేని ఆరోపణలు చేస్తున్నారని వ్యవసాయ మంత్రి విమర్శించారు. రైతుబంధు పథకం క్రింద లబ్ధి పొందుతున్న వారిలో 98.24 శాతం మంది సన్న, చిన్నకారు రైతులే అని తెలిపారు.రాజకీయాలకు, కులాలకు, మతాలకు అతీతంగా తెలంగాణ గడ్డమీద పుట్టిన ప్రతి బిడ్డకు అన్ని పథకాలను వర్తింపచేస్తున్నామని వివరించారు. వచ్చే అగస్టు 15 నుండి రైతులకు రూ. 5 లక్షల భీమా ను అమలు చేస్తున్నామని పోచారం చెప్పారు. ప్రతి రైతుకు రూ. 2271 ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుంది, ఇందుకోసం వెయ్యి కోట్లు ఖర్చు చేస్తున్నామని ఆయన తెలిపారు.గత ఏడాది యాసంగిలో 35 లక్షల టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు.ప్రభుత్వానికి నష్టమైనా రైతుల నష్టపోకూడదని కందులు, మక్కలు, సోయా, ఎర్రజోన్న లను మద్దతు ధరకు కొనుగోలు చేశామన్నారు. సిరిసిల్ల నియోజకవర్గ 4వ ప్రగతి నివేదికను మంత్రి పొచారం విడుదల చేేశారు. ఈ కార్యక్రమంలో వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్, PJTSAU వైస్ చాన్సలర్ డా. ప్రవీణ్ రావు, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.