రైలు కింద పడి చిరుత మృతి.

మహబూబ్ నగర్:
రైలు కింద పడి చిరుతపులి మృతి చెందిన సంఘటన దేవరకద్ర మండల పరిధిలోని వెంకటాయపల్లి గ్రామ సమీపం లో చోటు చేసుకుంది. అటవీ శాఖ, పోలీ సులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామ సమీపంలో ఉన్న ఊరగుట్ట నుంచి మరో గుట్టకు వెళ్తున్న సమయంలో రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొంది. ఈ విషయాన్ని గుర్తించిన గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు.