రైలు నుంచి కింద పడబోతూ బతికిన యువతి.

ముంబయి:
చెవిలో ఇయర్ ఫోన్స్.. గాల్లో చేతులు.. ట్రైన్‌లో పట్టుతప్పి…. లోకల్ ట్రైన్‌లో ప్రయాణం చేయక తప్పని పరిస్థితి. ఫోన్లను ఒక్కక్షణం కూడా వీడని యువతీ యువకులు అంత రష్‌లో కూడా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ వుంటారు. లేదంటే స్నేహితులతో కబుర్లు. జరగబోయే ఆపదని ముందే గుర్తించలేని పరిస్థితి. సడెన్‌గా ఏదైనా ఉపద్రవం ఎదురైతే ఎలా ఎదుర్కోవాలో తెలియదు. ఒక్క క్షణం ఏమీ అర్థం కాదు. ముంబయి లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తున్న ఓ యువతి పట్టు తప్పి జారిపడిపోయింది.ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఫుట్ బోర్డ్ ప్రయాణం చేస్తోంది. డోర్ హ్యాండిల్ పట్టుకుని వేలాడుతూ చేతులు బయటకు చాచి నుంచునేందుకు ప్రయత్నించింది. ఇంతలో పక్క నుంచి మరో లోకల్ రైలు రావడంతో కంగారులో ఆమె చేతులు వదిలేసింది. దీంతో పట్టుతప్పి కింద పడబోయింది. పక్కనే ఉన్న మరో ప్రయాణికుడు వెంటనే అప్రమత్తమై ఆమె దుస్తులు పట్టుకుని తోటి ప్రయాణీకుల సాయంతో పైకి లాగారు.పక్కవారు అలెర్ట్ అవడంతో అదృష్టం బావుండి ప్రాణాలతో బయటపడింది. లేకపోతే రైలు కిందపడి ఆమె ప్రాణాలు కోల్పోయేది. స్వల్పగాయాలతో బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన అక్టోబరు 1న మహారాష్ట్రలోని ఘాట్కోపర్, విక్రోలీ ప్రాంతాల మధ్య జరిగింది.