రైల్వే సమస్యలు పరిష్కరించాలి.

-మంత్రి ఈటెల.
న్యూ ఢిల్లీ:
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ వద్ద దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న అంశాలను పరిష్కరించాలని  కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ను తెలంగాణ రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ కోరారు. సోమవారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో ఢిల్లీ లోని రైల్ భవన్ కార్యాలయంలో మంత్రి ఈటెల రాజేందర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో  తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తో పాటు పార్లమెంటు సభ్యులు బి. వినోద్ కుమార్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి లు ఉన్నారు. అనంతరం తెలంగాణ ఆర్ధిక  మంత్రి ఈటెల మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న రైల్వే  సమస్యల ను పార్లమెంట్ లోను, పార్లమెంట్ బయట రైల్వే మంత్రి దృష్టికి చాలా సార్లు తీసుకెళ్లామని తెలిపారు. కాకతీయ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ని సికింద్రాబాద్ లోనే  కాక  ఉప్పల్ లో కూడా ఆపాలని  కేంద్ర మంత్రి ని కోరినట్లు వెల్లడించారు. ఉప్పల్ రైల్వే స్టేషన్ ని కూడా అభివృద్ధి చేయాలని కోరామన్నారు. అధేవిధంగా ఇంటర్ సిటీ, పాట్నా రెండు ఎక్స్ ప్రెస్ రైలు లు జమ్మికుంట రైల్వే స్టేషన్ లో ఆపాలని కేంద్రమంత్రికి విజ్నప్తి చేశామన్నారు. జమ్మికుంట ఒక వ్యాపార కేంద్రమే కాకుండా ,రద్దీ గా ఉండే ప్రాంతం కాబట్టి పలు రైళ్ల హాల్టింగ్ అత్యవసరమని కేంద్రమంత్రికి సూచించామని దీంతో పాటుగా కరీంనగర్ నుంచి తిరుపతి వరకు నడుస్తున్న వీక్లీ ట్వైస్ ట్రైన్ ని తెలంగాణ ఆ ప్రాంత ప్రజల అభ్యర్ధన దృష్ట్యా  ప్రతి రోజు నడపాలని కోరినట్లు వెల్లడించారు. ఉత్తర తెలంగాణ నుంచి వందలాది మంది భక్తులు దర్శనం కొరకు తిరుమలకు వెళ్తుంటారని దీనివల్ల రద్దీ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ప్రతి రోజు ట్రైన్ నడపాలని అడిగామని కోరారు. ముంబాయ్ నుంచి నిజామాబాద్ కి ఒకే ట్రైన్ ఉంది, దీనికి రద్దీ ఎక్కువగా ఉండడం వలన ఈ ట్రైన్ ని కరీంనగర్ వరకు పొడిగించాలని కోరామని అన్నారు. నిజామాబాదు నుంచి పెద్దపల్లి వరకు రైల్వే లైన్ కూడా ఉన్నవిషయాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిపారు. అధేవిధంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నుంచి కేంద్రాన్ని కోరిన ఫ్లై ఓవర్ లను కూడా త్వరగా మంజూరు చేయాలని కేంద్రమంత్రి  ని అడిగినట్లు తెలిపారు. తమ ప్రతిపాదనల పట్ల కేంద్ర రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారని ఈటెల వెల్లడించారు. పర్యావరణ దినోత్సవ లో భాగంగా దేశరాజధాని ఢిల్లీలోని  రాజ్ పథ్ లో ఏర్పాటు చేసిన సింగరేణి స్టాల్ ను మంత్రి ఈటెల రాజేందర్, ఎంపిలు బి. వినోద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి లు సందర్శించారు. సింగరేణి స్టాల్ లో ఏర్పాటు చేసిన మ్యాన్ రైడింగ్ సిస్టమ్ మోడల్, ఓబి టూ సాండ్ ప్రొసెసింగ్ మోడల్, అడ్రియాల లాంగ్ వాల్ మోడల్, బాటమ్ ఆశ్ స్టోగింగ్ మోడల్ ను ఈ సందర్భంగా వారు పరిశీలించారు.  ప్రధానంగా పర్యావరణ పరిరక్షణలో సింగరేణి చేప్పట్టిన ఈ యంత్రాల పనితీరును ఈటెల అడిగి తెలుసుకున్నారు.