రొట్టెల పండుగ విజయవంతం.

నెల్లూరు;

నెల్లూరు బారా షహీద్ దర్గాలో ఏటా నిర్వహించే రొట్టెల పండుగ విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. అన్ని శాఖలు చక్కని సమన్వయంతో పని చేయడం వల్లనే రొట్టెల పండుగ కార్యక్రమం విజయవంతమైందని మంత్రి అన్నారు. ఈ రోజు సాయంత్రం ముగింపు ఉత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. ముగింపు ఉత్సవంలో రొట్టెల పండుగ విజయవంతం కావడానికి బాగా పనిచేసినందుకు అన్ని ప్రభుత్వశాఖల సిబ్బందిని, జర్నలిస్టులను సత్కరించనున్నట్టు నారాయణ తెలిపారు.