రోడ్డుప్రమాదంలో జర్నలిస్ట్ కుటుంబం మృతి.

గజ్వేల్:
రాజీవ్ రహదారిపై గజ్వేల్ దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక జర్నలిస్ట్ కుటుంబం బలయ్యింది.క్వాలిస్‌లో ప్రయాణిస్తున్న నవ తెలంగాణ పత్రిక జర్నలిస్ట్ లక్ష్మణ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు మృత్యువాత పడ్డారు. ఆయన భార్య పుష్ప, పిల్లలు ఆకాశ్(10), నిహారిక(9), విజయ(6), తల్లిదండ్రులు గొర్ల మల్లేశం, గండెమ్మ మృతి చెందారు. లక్ష్మణ్‌ది సంగారెడ్డి జిల్లా జిన్నారంగా పోలీసులు గుర్తించారు.