రౌడీ షీటర్ దాడిలో యువకునికి తీవ్ర గాయాలు

హైదరాబాద్:

గోల్కొండ పీ ఎస్ పరిధిలో రౌడిషీటర్ బద్రినాధ్ హల్చల్ చేశాడు.జిలాని అనే వ్యక్తి దర్వాజ వద్ద తన వాహనాన్ని రివర్స్ తెస్తున్న సమయంలో బద్రినాధ్ యాదవ్ వాహనాన్ని తాకడంతో రౌడీషీటర్ బద్రి కోపంతో ఊగిపోయాడు. తన అనుచరులతో జిలాని పై దాడి చేశాడు.జిలానీ తీవ్రంగా గాయపడ్డాడు.ఉస్మానియా ఆసుపత్రికి పోలీసులు తరలించారు.దాడి ఘటనకు సంబంధించి సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు పరిశీలించారు.పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.